Gold Rate: మరి కాస్త కిందికి దిగిన బంగారం ధరలు..మరింత పైకెక్కిన వెండి ధరలు!

Gold Rate: తగ్గిన బంగారం ధరలు..పైకెగసిన వెండి ధరలు!

K V D Varma
Published on: 18 Aug 2020 7:59 AM IST
Gold Rate: మరి కాస్త కిందికి దిగిన బంగారం ధరలు..మరింత పైకెక్కిన వెండి ధరలు!
X
Gold rate today

బంగారం ధరలు ఈరోజూ కాస్త నెమ్మదించాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం పైకే కదిలాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 18) దేశీయంగా తగ్గుదల నమోదుచేశాయి. మరో వైపు వెండి ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (18.08.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధరల కంటే తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 310 రూపాయలు తగ్గింది. దీంతో 50,700 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 340 రూపాయలు తగ్గింది. దీంతో 55,320 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పెరిగాయి..

బంగారం ధరలు తగ్గుదలదల నమోదు చేస్తే, వెండి ధరలు మరింత పెరిగాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 890 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్దే వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 68,900 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 310 రూపాయలు తగ్గింది. దీంతో 50,700 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 340 రూపాయలు తగ్గింది. దీంతో 55,320 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే 10 రూపాయలు తగ్గి 51,150 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల ౨౪ క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం ధరతో పోలిస్తే 10 రూపాయలు తగ్గింది. దీంతో 55,090 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే భారీగా పెరిగాయి. ఈరోజు 890 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68 వేల రూపాయల గరిష్ట రికార్డు ధర వద్దే వెండి నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 68,900 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 18-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

K V D Varma

K V D Varma

Next Story