Gold Rate: మార్పులు లేని బంగారం ధరలు.. కాస్త పెరిగిన వెండి ధరలు!

Gold rate Today Hyderabad Amaravathi
x

Gold Rate 

Highlights

Gold Rate: నిన్న పెరిగినట్టు కనిపించిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు బంగారం ధరలలో మార్పులు లేవు. ఇక వెండి ధరలు మాత్రం పెరుగుదల బాట వదలలేదు. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Gold Rate: బంగారం ధరలు మంగళవారం మార్పులు లేకుండా ఉన్నాయి. దీంతో బుధవారం మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కదలిక లేకుండా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు (17.03.2021) మార్పులు లేవు. మరో వైపు వెండి ధరలు కొద్దిగా పెరుగుదల కనబరిచాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మంగళవారం(16.03.2021) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 42,010 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 45వేలరూపాయల మార్క్ వద్ద నిలిచింది. దాంతో 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర వద్దే కొనసాగుతుంది. మొత్తానికి 10 గ్రాముల బంగారం ధర 45,830 రూపాయల వద్దే కొనసాగుతుంది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు స్థిరంగా ఉంటె.. వెండి ధరలు మాత్రం కాస్త పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరిగింది. దీంతో 71 వేల రూపాయల స్థాయిలోనే వెండి ధరలు ఉన్నాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 71,600 రూపాయల వద్ద కు ఎగబాకింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. మంగళవారం(16.03.2021) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరల వద్దే నిలకడగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 42,010 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 45వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా ఎగువన ఉంది.10 గ్రాముల బంగారం ధర 45,830 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మగళవారం నాటి ప్రారంభ ధర 44,౧౫౦ రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ప్రారంభ ధర 48,160 రూపాయల వద్ద ఉంది.

ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరకంటె కాస్త తగ్గుదల నమోదు చేసి 67 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు నిలిచింది. దీంతో కేజీ వెండి ధర 67,600 రూపాయలుగా నమోదు అయింది. హైదరాబాద్ ధరతో పోలిస్తే ఢిల్లీలో వెండిధర 4100 రూపాయలు తక్కువగా ఉంది. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 17-03-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories