Gold Rate: మార్పులు లేని బంగారం ధరలు.. భారీ షాకిచ్చిన వెండి ధరలు

Gold Rate: మార్పులు లేని బంగారం ధరలు.. భారీ షాకిచ్చిన వెండి ధరలు
x
Highlights

Gold Rate: నిన్న కిందికి దిగొచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు బంగారం ధరలు ఎటువంటి మార్పులు చెందలేదు. ఇక వెండి ధరలు ఒక్కసారిగా భారీస్థాయిలో పైకెగశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు మంగళవారం మార్పులు లేకుండా నిలిచాయి. దీంతో బుధవారం మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే ఎటువంటి మార్పులు లేకుండా నిలిచాయి. బంగారం ధరలు ఈరోజు (16.12.2020) స్వల్పంగా తగ్గాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీస్థాయిలో పెరిగాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. బుధవారం (16.12.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర వద్దే స్థిరంగా 45,800 రూపాయలుగా ఉన్నాయి. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా మార్పులు లేకుండా 50 వేలరూపాయల మార్క్ కంటె దిగువ స్థాయిలో 49,960 రూపాయలుగా ఉన్నాయి.

వెండి ధరలు భారీ పెరుగుదల..

బంగారం ధరలు స్థిరంగా ఉంటె..వెండి ధరలు మాత్రం భారీ స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధరలు ఒక్కసారిగా పైకెగశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 4700 రూపాయలు పెరిగాయి. దీంతో 69 వేల రూపాయల స్థాయికి పెరిగిపోయింది. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 67,900 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా ఉన్నాయి. బుధవారం (16.12.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర వద్దే స్థిరంగా 45,800 రూపాయలుగా ఉన్నాయి. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా మార్పులు లేకుండా 50 వేలరూపాయల మార్క్ కంటె దిగువ స్థాయిలో 49,960 రూపాయలుగా ఉన్నాయి.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్పులు లేకుండా మంగళవారం నాటి ప్రారంభ ధర 47,950 రూపాయల వద్దే నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మార్పులు లేకుండా మంగళవారం నాటి ప్రారంభ ధర వద్దే 52,310 రూపాయలుగా ఉంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ కూడా వెండి ధరలు పెరుగుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 950 రూపాయలు తగ్గుదల నమోదు చేసి 64 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 64,150 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 16-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories