Gold Rate: ఎగసిన బంగారం ధరలు..స్వల్పంగా పెరిగిన వెండిధరలు

Gold Rate: ఎగసిన బంగారం ధరలు..స్వల్పంగా పెరిగిన వెండిధరలు
x
Highlights

Gold Rate: బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పైకి కదిలాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పైకి కదిలాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు ఈరోజు దేశీయంగా కొద్దిగా పైకి కదిలాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరల కొద్దిగా పై చూపులు చూశాయి. బంగారం ధరలు ఈరోజు (14.11.2020) పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం కొద్దిపాటి పెరుగుదల బాటలోనే కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు కొద్దిగా పైకెగాశాయి. శనివారం (14.11.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పైకి కదిలాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగి 47,450 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 270 రూపాయలు పైకెగసి 51,760 రూపాయల వద్దకు చేరింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు కొద్దిగా పై చూపులు చూస్తె, మరోవైపు వెండి ధరలు మాత్రం ఈరోజు స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 10 రూపాయలు పెరిగింది. దీంతో 63 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగశాయి. దీంతో కేజీ వెండి ధర 63,310 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శనివారం (14.11.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పైకి కదిలాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు పెరిగి 47,450 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 270 రూపాయలు పైకెగసి 51,760 రూపాయల వద్దకు చేరింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు అత్యంత స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరిగింది. దీంతో 49,260 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 10 రూపాయలు పెరుగుదల కనబరిచింది. దీంతో 53,630 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు ఈరోజు కొద్దిగా పెరుగుదల కనబరిచాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 10 రూపాయలు పెరిగింది. దీంతో 62 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 62,710 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 14-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories