Gold Rate: శుభవార్త! మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు పైకి!

Gold and Silver Rate Today in Andhra Pradesh and Telangana
x

బంగారం ధరలు (ప్రతీకాత్మక చిత్రం)

Highlights

Gold Rate: బంగారం ప్రియులకు శుభవార్త. ఈరోజు బంగారం ధరలలో తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధరలు మాత్రం పైకెగశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు సోమవారం తగ్గుదల కనబరిచాయి. దీంతో మంగళవారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు ఈరోజు (12.01.2021) తగ్గుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు కిందికి దిగివచ్చాయి. మంగళవారం (12.01.2021) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 410 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,900 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 50 వేలరూపాయల మార్క్ వద్దకు దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 440 రూపాయల తగ్గుదల నమోదు చేసి 50,070 రూపాయలుగా నిలిచింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు పడిపోతే.. వెండి ధరలు మాత్రం పైకెగశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరకంటె 600 రూపాయలు పెరిగింది. దీంతో 69 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 69,600 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు కిందికి దిగివచ్చాయి. మంగళవారం (12.01.2021) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలకంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 410 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,900 రూపాయలుగా నమోదు అయింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 50 వేలరూపాయల మార్క్ వద్దకు దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 440 రూపాయల తగ్గుదల నమోదు చేసి 50,070 రూపాయలుగా నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గుదల బాటలో నడిచాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధర కంటె 410 రూపాయలు తగ్గి 48,050 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయలు తగ్గింది. దీంతో 52,420 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు పెరుగుదల బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 900 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 64 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగశాయి. దీంతో కేజీ వెండి ధర 64,800 రూపాయలుగా నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 12-01-2021 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories