Gold Rate: పసిడి ప్రియులకు దీపావళి ముందే వచ్చింది.. భారీగా తగ్గిన బంగారం.. వెండి ధరలు!

Gold Rate: పసిడి ప్రియులకు దీపావళి ముందే వచ్చింది.. భారీగా తగ్గిన బంగారం.. వెండి ధరలు!
x
Highlights

Gold Rate: ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఒక్కసారిగా కిందికి దిగొచ్చాయి. దీపావళి పండగ ముందుగానే వచ్చేసింది బంగారం ప్రియులకు. ఇంక వెండి వరుసగా రెండో రోజూ భారీ పతనాన్ని నమోదు చేసింది. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

పసిడి ప్రియులకు భారీ శుభవార్త. బంగారం ఎన్నడూ లేనంత కింది చూపులు చూస్తోంది. బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే భారీ తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (11.11.2020) రికార్డు స్థాయిలో కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు వరుసగా రెండో రోజూ భారీ పతనం చూశాయి. బంగారం, వెండి ఏకంగా వేల రూపాయల పతనాన్ని చూడటం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు కిందికి దిగొచ్చాయి. అదీ భారీగా. బంగారం ధరలు ఈరోజు భారీ తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (11.11.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1500 రూపాయలు కిందికి దిగి.. 47,100 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 1640 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 51,380 రూపాయలకు దిగివచ్చింది.

వెండి ధరలు రెండో రోజూ భారీ పతనం..

బంగారం ధరలు భారీ తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా ఈరోజు బంగారం బాటలోనే భారీగా కిందికి దిగొచ్చాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 3500 రూపాయలు తాగింది. దీంతో 61 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 61,900 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు భారీ తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (11.11.2020) బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1500 రూపాయలు కిందికి దిగి.. 47,100 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 1640 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 51,380 రూపాయలకు దిగివచ్చింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు అదే స్థాయిలో కిందికి దిగొచ్చాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 1500 రూపాయలు తగ్గింది. దీంతో 49,150 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా మంగళవారం నాటి ప్రారంభ ధర కంటె 1650 రూపాయలు తరుగుదల కనబరిచింది. దీంతో 53,600 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడవెండి ధరలు కూడా ఈరోజు బంగారం బాటలోనే భారీగా కిందికి దిగొచ్చాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 3500 రూపాయలు తాగింది. దీంతో 61 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పడిపోయాయి. దీంతో కేజీ వెండి ధర 61,900 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 11-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories