Gold Rate: పెద్దగా మార్పులు లేని బంగారం ధరలు.. పైకే కదిలిన వెండి ధరలు!

Gold Rate: పెద్దగా మార్పులు లేని బంగారం ధరలు.. పైకే కదిలిన వెండి ధరలు!
x
Highlights

Gold Rate: ఈరోజు బంగారం ధరలు పెద్దగా మార్పులు లేకుండా నిలిచాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీ పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభధరలు ఇలా ఉన్నాయి

నిన్న కాస్త పైకెగసిన బంగారం ధరలు ఈరోజు కూడా చాలా స్వల్పంగా పైచూపులు చూశాయి. బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే చాలా తక్కువగా పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (08.11.2020) పెద్దగా మార్పులు లేకుండా నామ మాత్రపు పెరుగుదల కనబరిచాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీగా పైకెగాశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి . బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం (08.11.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 48,010 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,360 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు ఈరోజు భారీగా ఎగశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 900 రూపాయలు పెరిగింది. దీంతో 65వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పరుగులు తీశాయి. దీంతో కేజీ వెండి ధర 65,400 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం (08.11.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 48,010 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,360 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు పై పైకే కదిలాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధర కంటె 400 రూపాయలు పెరిగింది. దీంతో 50,450 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం శనివారం నాటి ప్రారంభ ధర కంటె 430 రూపాయలు పెరుగుదల కనబరిచింది. దీంతో 55,030 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 900 రూపాయలు పెరిగింది. దీంతో 65వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగశాయి. దీంతో కేజీ వెండి ధర 65,400 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories