Gold Rate: పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. వెండి ధరలూ పైకి కదిలాయి!

Gold Rates in India today
x
Gold Rate Today (representational image)
Highlights

Gold Rate: బంగారం ధరలు వరుసగా నాలుగోరోజు ఈరోజు కూడా పెరుగుదల బాటలోనే నడిచాయి. వెండి ధరలు కూడా పై చూపులు చూశాయి ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

బంగారం ధరలు వరుసగా నాలుగోరోజు కూడా పైకెగశాయి. ఈరోజు కూడా పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే పరుగులు తీశాయి.. బంగారం ధరలు ఈరోజు (05.12.2020)కూడా పై చూపులు చూశాయి. మరో వైపు వెండి ధరలు కూడా పెరుగుదల బాట పట్టాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజూ పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (05.12.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయల పెరుగుదల నమోదు చేసి 46,100 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు పైకి కదిలి మళ్ళీ 50 వేలరూపాయల మార్క్ అందుకుంది. దీంతో 50,290 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు కొద్దిగా పైకి కదిలితే, మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 200 రూపాయలు పెరుగుదల కనబరిచాయి. దీంతో 67 వేలరూపాయల స్థాయికి ఎగసివచ్చింది. దీంతో కేజీ వెండి ధర 67,500 రూపాయల వద్దకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శనివారం (05.12.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయల పెరుగుదల నమోదు చేసి 46,100 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు పైకి కదిలి మళ్ళీ 50 వేలరూపాయల మార్క్ అందుకుంది. దీంతో 50,290 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 200 రూపాయలు పెరిగింది. దీంతో 48,250 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 220 రూపాయలు పెరుగుదల కనబరిచింది. దీంతో 52,630 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 1600 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 64 వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 64,000 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05-12-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories