Gold Rate: పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు.. లేటెస్ట్ రేట్స్ ఇలా..

Gold Rate: పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు.. లేటెస్ట్ రేట్స్ ఇలా..
x

gold rate today 

Highlights

Gold Rate: బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. ఇక వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

నిన్న కొద్దిగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పై చూపులు చూశాయి. బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (05.10.2020) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజూ కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (05.10.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయలు పెరిగి 48,500 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 40 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,900 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు నిలకడగా..

బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల వద్దే స్థిరంగా ఉంది. ఈరోజు ఎటువంటి మార్పులు లేకుండా ఉంది. దీంతో 61వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 61,200 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. సోమవారం (05.10.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయలు పెరిగి 48,500 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 40 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,900 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,300 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 110 రూపాయలు పెరిగింది. దాంతో 53,780 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఇక్కడ కూడా వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల వద్దే స్థిరంగా ఉంది. ఈరోజు ఎటువంటి మార్పులు లేకుండా ఉంది. దీంతో 61వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 61,200 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories