దేశీయ మార్కెట్ లో దిగివస్తున్న విలువైన లోహాల ధరలు..

దేశీయ మార్కెట్ లో దిగివస్తున్న విలువైన లోహాల ధరలు..
x
Highlights

దేశీయ మార్కెట్ లో విలువైన లోహాల ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర వంద రూపాయల మేర తగ్గి 53వేల...

దేశీయ మార్కెట్ లో విలువైన లోహాల ధరలు క్రమేపీ దిగివస్తున్నాయి. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర వంద రూపాయల మేర తగ్గి 53వేల 190 రూపాయలకు చేరుకోగా, వెండి ధర కిలో 64వేల 400 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరోవైపు దేశీయ విఫణి మల్టీ కమోడిటీ ఎక్సేంజీ..ఎంసిఎక్స్ లో పసిడి ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.02 శాతం మేర తగ్గి 49వేల 250 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి కిలోకు 0.2 శాతం మేర స్వల్పంగా పెరిగి..63వేల635 రూపాయల వద్ద కదలాడుతోంది. సాధారణంగా విలువైన లోహాల ధరలపై ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, కేంద్ర బ్యాంకుల్లోని నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ప్రభావం చూపుతూ వుంటాయి. అనిశ్చిత సమయాల్లో పసిడిలో పెట్టుబడులు సురక్షితమని మదుపర్లు భావిస్తుండటంతో ధరలకు రెక్కలు వచ్చినట్లయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories