గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం ధర.. అదేబాటలో వెండి

గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం ధర.. అదేబాటలో వెండి
x

గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం ధర.. అదేబాటలో వెండి

Highlights

*దేశీయ మార్కెట్ లో దిగివచ్చిన పుత్తడి *కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు, గ్లోబల్ మార్కెట్ లో తగ్గిన డిమాండ్

దేశీయ మార్కెట్లో బంగారం ధర మరింతగా దిగివచ్చింది. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలకు తోడు గ్లోబల్ మార్కెట్ లో మందగించిన డిమాండ్ నేపథ్యంలో దేశీయ విఫణి ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర దిగివస్తోంది. తాజా సెషన్ లో 0.86 శాతం క్షీణించగా.. 10 గ్రాముల బంగారం ధర 47 వేల 340 రూపాయల వద్దకు చేరింది. మరోవైపు వెండి ధర సైతం 1.55 శాతం మేర తగ్గి కిలో వెండి ధర 68 వేల దిగువన 67వేల 6వందల 34 రూపాయల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 47వేల నూట ముప్పైఐదు రూపాయలుగా నమోదు అయ్యాయి. ముంబైలో 46 వేల 6వందలకు చేరాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఎల్లోమెటల్ ధర 48 వేల 970 రూపాయల వద్దకు చేరింది.



Show Full Article
Print Article
Next Story
More Stories