Gold, Silver Price Today: పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

Gold Price Today: బంగారం ధరలు మళ్లీ పెరగ్గా... వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి

Kranthi
Published on: 15 May 2021 7:00 AM IST
Gold price To Day on May 15th, 2021 at Hyderabad, Delhi, Vijayawada, Mumbai, Chennai
X

Gold, Silver Price Today:(File Image) 

Gold Price Today: దేశ వ్యాప్తంగా బంగారం ధర రూ.150 వరకు పెరిగింది. దేశ వ్యాప్తంగా శనివారం ఉదయం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలను పరిశీలిస్తే..నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 10 గ్రాములు రూ.44,650 ఉంది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.35,720 ఉంది. నిన్న తులం ధర రూ.120 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,465 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.48,710 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,720 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,720 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560 ఉంది. అలాగే బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,560 ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560 కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది.

వెండి ధరలు...

దేశంలో ఒక వైపు బంగారం పెరుగుతుంటే.. మరోవైపు వెండి తగ్గుతోంది. నిన్న ఉదయం కిలో వెండి ధరపై రూ.370 వరకు దిగి రాగా, తాజాగా శనివారం కిలో వెండి ధరపై రూ.700 మేర తగ్గుముఖం పట్టింది.

దేశంలో ప్రధాన నగరాల్లో...

రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, చెన్నైలో రూ.75,300 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, కోల్‌కతాలో రూ.70,500 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, కేరళలో రూ.70,500 ఉంది. ఇక తెలంగాణలోని బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కేరళలో రూ.71.500 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,300 ఉండగా, ఏపీలోని విజయవాడలో కిలో వెండి ధర రూ.75,300 వద్ద ఉంది.వద్ద కొనసాగుతోంది..

గమనిక: ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Kranthi

Kranthi

Next Story