Gold rate: దేశీయ మార్కెట్లో స్వల్పంగా తగ్గిన పుత్తడి ధర

Gold rate: ఎంసిఎక్స్ లో నెమ్మదించిన ఎల్లోమెటల్ పరుగులు * ఎంసిఎక్స్ లో 0.08 శాతం మేర తగ్గిన పుత్తడి ధర

Sandeep Eggoju
Published on: 27 Feb 2021 10:08 AM IST
Gold Price down In Indian metro cities
X

గోల్డ్ (ఫైల్ ఇమేజ్)

Gold Rate: దేశీయ మార్కెట్లో విలువైన లోహం పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి..దేశీయ విఫణి మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ -ఎంసిఎక్స్ లో ఎల్లోమెటల్ గత కొద్దిరోజులుగా లాభాల్లో పరుగులు తీస్తుండగా..ప్రస్తుతం కాస్తంత నెమ్మదించింది..ఎంసీఎక్స్ లో 10 గ్రాముల గోల్డ్ ధర 0.08 శాతం మేర తగ్గి 46,203 రూపాయల వద్దకు చేరగా..మరో విలువైన లోహం వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.70 శాతం క్షీణించి 68,790 వద్దకు చేరాయి.దేశీయ స్పాట్ మార్కెట్ లో 10 గ్రాముల ధర స్వల్పంగా తగ్గినప్పటికీ..49,690 రూపాయల వద్ద కొనసాగుతోంది..అదే విధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ , విశాఖల్లో 22 క్యారెట్ల ధర 43,250 గా నమోదు కాగా 24 క్యారెట్ల ధర 47,410 రూపాయలుగా నమోదవుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story