Gold Rate: దేశీయ మార్కెట్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధర

Gold Price Down in Indian Markets
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Gold Rate: ఎంసీఎక్స్ లో ఎల్లోమెటల్ 10 గ్రా. రూ.46,080 * మరోమారు స్వల్పంగా తగ్గిన పుత్తడి ధర

Gold Rate: దేశీయ మార్కెట్లో విలువైన లోహం పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయ విఫణి మల్టీ కమోడిటీ ఎక్సేంజీ ఎంసీఎక్స్ లో ఎల్లోమెటల్ పదిగ్రాములకు స్వల్ప తగ్గుదల నమోదు చేస్తూ 46,080 వద్దకు చేరింది. అయితే వచ్చే రెండు నెలల వ్యవధిలోగా 48 వేల మార్క్ ను చేరడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దేశంలోని ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు 44,200 రూపాయల వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబైలో 43,800 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ , విశాఖల్లో 22 క్యారెట్ల ధర 42,050 గా నమోదు కాగా..24 క్యారెట్ల ధర 46,390 రూపాయల వద్దకు చేరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories