Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం.. హెచ్చు తగ్గులతో వెండి ధరలు...

Gold and Silver Rates Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు...

Shireesha
Updated on: 17 April 2022 8:38 AM IST
Gold and Silver Rates Today 17 04 2022 in Hyderabad Vijayawada Delhi Mumbai Chennai Bangalore
X

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం.. హెచ్చు తగ్గులతో వెండి ధరలు...

Gold and Silver Rates Today: నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం ధరలతో పోలిస్తే ధరలలో పెద్దగా వ్యత్యాసం లేదు. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా ఉంది. అయితే హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు మాత్రం నేడు నేలచూపులు చూసింది. కేజీ వెండి ధర ఆదివారం రూ.200 తగ్గి రూ.74,200గా నమోదైంది.

విజయవాడలో కూడా వెండి ధరలు ఈ విధంగానే నమోదయ్యాయి. రూ.200 తగ్గిన వెండి ధర విజయవాడలో రూ.74,200గా రికార్డయింది. ఇకపోతే బంగారం ధరలలో విజయవాడ మార్కెట్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర కూడా అక్కడ రూ.49,550గానే ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా రికార్డయింది.

ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్తబ్దుగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా రికార్డయ్యాయి. కేజీ సిల్వర్ రేటు మాత్రం ఢిల్లీలో భారీగా దిగొచ్చింది. ఈ రేటు కేజీకి రూ.900 తగ్గి రూ.69,100గా రికార్డయింది.

ముంబై మార్కెట్లో మాత్రం వెండి ధరలు భారీగా పైకి ఎగిశాయి. ఒక్కసారిగా కేజీ వెండి ధర అక్కడ మార్కెట్లో రూ.4,200 పెరిగి రూ.74,200కు చేరుకుంది. వెండి ధరలు భారీగా పెరిగినప్పటికీ, బంగారం ధరలలో పెద్దగా మార్పు లేదు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా రికార్డయింది.

బెంగళూరు మార్కెట్లో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,060గా నమోదయ్యాయి. బెంగళూరు మార్కెట్లో సిల్వర్ రేటు కేజీకి రూ.200 దిగొచ్చి రూ.74,200గా రికార్డయింది.

చెన్నైలో మాత్రం బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90 పెరిగి రూ.50,140గా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.54,700కు చేరుకుంది. వెండి ధరలు చెన్నైలో కేజీకి రూ.200 తగ్గి రూ.74,200గా ఉన్నాయి.

Shireesha

Shireesha

Next Story