Gold and Silver Rate Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు...

Gold and Silver Rate Today 02 01 2022 in Hyderabad Telangana | Business News
x

Gold and Silver Rate Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు...

Highlights

Gold and Silver Rate Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు...

Gold and Silver Rate Today: బంగారం ధర పడిపోతూనే వస్తోంది. బంగారం ధర ఈ వారంలో నేల చూపులు చూసింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర ఈ వారంలో రూ.350 వరకు పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గుదలతో రూ.45,100కు దిగొచ్చింది.

వారం ఆరంభంలో బంగారం ధర రూ.45,450 వద్ద ఉండేది. బంగారం ధర ఈ వారంలో మూడు రోజులు పడిపోతూనే వచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఈ బంగారం ధర 10 గ్రాములకు వారం ఆరంభంలో రూ.49,590 వద్ద ఉండేది. ఇప్పుడు రూ.49,200 వద్ద ఉంది. అంటే బంగారం ధర రూ.390 పడిపోయిందని చెప్పుకోవచ్చు. వారంలో బంగారం ధర వరుసగా 3 రోజులు తగ్గుతూ వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories