Today Gold and Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు...

Today Gold and Silver Price: ఈ రోజు బంగారం, వెండి ధరలు...

Shireesha
Updated on: 9 April 2022 8:18 AM IST
Gold and Silver Price Today 09 04 2022 in Hyderabad Visakhapatnam | Live News
X

Today Gold and Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు...

Today Gold and Silver Price: హైదరాబాద్‌లో బంగారం రేట్లు పెరుగుతూనే వస్తున్నాయి. ఈరోజు (ఏప్రిల్ 9, శనివారం) కూడా పుత్తడి మెరిసింది. పసిడి రేటు నేడు 10 గ్రాములకు రూ.250 మేర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,250కు చేరింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు. ఈ 2 రోజుల కాలంలో పసిడి రేటు ఏకంగా రూ.450 మేర పైకి చేరింది.

వెండి రేటు కూడా ఇంతే. సిల్వర్ రేటు ఈరోజు రూ.300 పెరిగితే.. నిన్న కూడా ఇదే స్థాయిలో పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే వెండి ధర రూ.600 పైకి ఎక్కి కూర్చుంది. ఇప్పుడు వెండి ధర రూ.71,300 వద్ద ఉంది. గుడ్ రిటర్న్న్ ప్రకారం ఈ రేట్లు ఉన్నాయి.

విశాఖపట్నం, విజయవాడ వంటి పట్టణాల్లో కూడా రేట్లను గమనిస్తే.. బంగారం ధర రూ.48,250 వద్ద, వెండి రేటు రూ.71,300 వద్ద కొనసాగుతున్నాయి. ఇక ప్లాటినం విషయానికి వస్తే.. ఈరోజు దీని ధర తులానికి రూ. 300 దిగి వచ్చింది. దీంతో ప్లాటినం రేటు రూ.23,210కు తగ్గింది. దీని రేటు గత నాలుగు రోజులుగా తగ్గుతూనే వస్తోంది.

Shireesha

Shireesha

Next Story