Gautam Adani: ఆవిరైన గౌతమ్‌ అదానీ సంపద..!

Gautam Adani Drops to 11th Place in Billionaires
x

Gautam Adani: ఆవిరైన గౌతమ్‌ అదానీ సంపద..!

Highlights

Gautam Adani: భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో టాప్‌-10 నుంచి బయటకు వచ్చేశారు.

Gautam Adani: భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో టాప్‌-10 నుంచి బయటకు వచ్చేశారు. అదానీ గ్రూప్‌ అత్యధిక కంపెనీల షేర్లు వరసగా మూడు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి భారీగా పతనం కావడం దీనికి ప్రధాన కారణం. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో అదానీ సంపద 34 బిలియన్‌ డాలర్లు ఆవిరైపోయింది. ప్రస్తుతం ఆయన 84.4 బిలియన్‌ డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాతి స్థానంలో 82.2 బిలియన్‌ డాలర్ల సంపదతో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కొనసాగుతున్నారు. ఇక అదానీ కంటే ముందు మెక్సికో సంపన్నుడు కార్లోస్‌ స్లిమ్‌ ఉన్నారు. అదానీ గ్రూప్‌ షేర్ల విలువ మూడు రోజుల్లో భారీగా కుంగింది. ఈ క్రమంలో 68 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ ఆవిరైపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories