Chicken: వేయించిన చికెన్ తో టూత్ పేస్ట్.. కేవలం 2 రోజుల్లోనే స్టాక్ క్లియర్..!

Fried Chicken Toothpaste Hits the Market Sells Out in 2 Days
x

Chicken: వేయించిన చికెన్ తో టూత్ పేస్ట్.. కేవలం 2 రోజుల్లోనే స్టాక్ క్లియర్..!

Highlights

Chicken: ఫ్రైడ్ చికెన్ పేరు వినే ఉంటారు.. చాలా మంది తినే ఉంటారు. కానీ, అది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఇప్పుడు టూత్‌పేస్ట్ కూడా అయిపోయింది.

Fried Chicken Toothpaste

Chicken: ఫ్రైడ్ చికెన్ పేరు వినే ఉంటారు.. చాలా మంది తినే ఉంటారు. కానీ, అది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఇప్పుడు టూత్‌పేస్ట్ కూడా అయిపోయింది. కేఎఫ్‌సీ సంస్థ తాజాగా ఫ్రైడ్ చికెన్ రుచి కలిగిన టూత్‌పేస్ట్‌ను విడుదల చేసింది. దీనిని మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ప్రత్యేక రుచి ప్రజలకు బాగా నచ్చడంతో మార్కెట్‌లోకి వచ్చిన రెండు రోజుల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడైపోయింది. కేఎఫ్‌సీ ఒరిజినల్ హాట్ చికెన్ రెసిపీ ముక్కలాగే ఈ టూత్‌పేస్ట్ కూడా మీ దంతాలకు రుచిని అందించి, మీ నోటికి తాజా అనుభూతిని కలిగిస్తుంది.

పరిమిత కాలానికి మాత్రమే విడుదల

కేఎఫ్‌సీ సంస్థ టూత్‌పేస్ట్ తయారీదారు హిస్మైల్‌తో కలిసి పరిమిత కాలానికి మాత్రమే ఈ ఉత్పత్తిని విడుదల చేసింది. హిస్మైల్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ కోబన్ జోన్స్ మాట్లాడుతూ, "కేఎఫ్‌సీ ప్రసిద్ధ రుచులను రోజువారీ అవసరాల్లో చేర్చడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు. మీరు దీనిని నోటిలో పెట్టుకుంటే, కేఎఫ్‌సీ ఒరిజినల్ రెసిపీ చికెన్ వేడి, జ్యుసి ముక్కను తింటున్నట్లు అనిపిస్తుంది" అని అన్నారు.

రెండు రోజుల్లోనే అమ్ముడైపోయింది

ఈ ఉత్పత్తి ప్రజలకు ఎంతగానో నచ్చడంతో మంగళవారం ఉదయానికే స్టాక్ మొత్తం అమ్ముడైపోయింది. ఈ టూత్‌పేస్ట్ హిస్మైల్ వెబ్‌సైట్‌లో 13 డాలర్లకు (సుమారు రూ. 1,120) అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు మొత్తం స్టాక్ అమ్ముడైపోయింది. "ఫ్లోరైడ్-ఫ్రీ ఫార్ములా" కలిగిన ఈ టూత్‌పేస్ట్ దీర్ఘకాలిక నోటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ టూత్‌పేస్ట్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్న వారు తదుపరి స్టాక్ వచ్చే వరకు వేచి ఉండాలి. కానీ, హిస్మైల్ వెబ్‌సైట్‌లో 59 డాలర్లకు (సుమారు రూ. 5,100) అందుబాటులో ఉన్న కొత్త కేఎఫ్‌సీ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్‌ను ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories