Debit Card Insurance: ఏటీఎం కార్డుతో రూ.3 కోట్ల ఇన్సూరెన్స్.. ఎలాగో తెలుసా?

Free Insurance on Debit Cards up to Rs 3 Crore
x

Debit Card Insurance: ఏటీఎంతో రూ.3 కోట్ల ఇన్సూరెన్స్.. ఎలాగో తెలుసా?

Highlights

Debit Card Insurance: ప్రమాదం ఎప్పుడూ ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేందుకు ఏడాదికో, ఆరు నెలలకో వేల రూపాయాలు చెల్లించి పాలసీలు తీసుకుంటాం.

Debit Card Insurance: ప్రమాదం ఎప్పుడూ ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేందుకు ఏడాదికో, ఆరు నెలలకో వేల రూపాయాలు చెల్లించి పాలసీలు తీసుకుంటాం. అయితే ఏటీఎం కార్డుంటే చాలు మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ విషయం ఎలాగో తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. డిజిటల్ పేమెంట్స్ అమల్లోకి రాకముందు డబ్బులు డ్రా చేసుకునేందుకు ప్రతిసారీ బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఏటీఎంలకు వెళ్లేవారు. అయితే ఏటీఎం కార్డుతో కొన్ని లాభాలున్నాయి.

ఏటీఎం కార్డుతో ఉచితంగా ఇన్సూరెన్స్ పొందవచ్చు. బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎం కార్డులు కలిగిన వారికి 4 లక్షల ఇన్సూరెన్స్ అందుతుంది. అయితే ఇది విమానంలో ప్రయాణించిన సమయంలో ప్రమాదం జరిగితే కూడా వర్తిస్తుంది. విమాన ప్రమాదంతో సంబంధం లేని ఇన్సూరెన్స్ 2 లక్షలను కూడా ఆ బ్యాంకు ఖాతాదారులు అందుతుంది. హెచ్ డీ ఎఫ్ సీ, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ లను అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులు తీసుకున్న బ్యాంకు ఖాతాల ఆధారంగా ఈ ఇన్సూరెన్స్ ను అందిస్తున్నాయి. కొందరికి రూ. 3 కోట్ల వరకు ఇన్సూరెన్స్ ను అందిస్తున్నాయి.

కొన్ని బ్యాంకులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే ఏటీఎం కార్డు కలిగిన ఖాతాదారుడికి రూ. 4 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ను కూడా అందిస్తున్నాయి. బ్యాంకుల్లో ఖాతా ప్రారంభించే సమయంలో డెబిట్ కార్డు జారీ చేసే సమయంలో ఈ విషయాలపై బ్యాంకు అధికారుల నుంచి వివరాలు తెలుసుకోవాలి.

డెబిట్ కార్డు ఖాతాదారుడు మరణిస్తే బ్యాంకులో ఉన్న సమాచారం ఆధారంగా నామినికి ఇన్సూరెన్స్ డబ్బులను అందిస్తారు. భారత్ లో సుమారు 97 కోట్లకు పైగా ఏటీఎం కార్డులు ఉపయోగిస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.ఏటీఏం కార్డుల మెయింటైన్స్ కోసం ఖాతాదారుల నుంచి బ్యాంకులు డబ్బులు వసూలు చేస్తాయి. ప్రతి ఏటా రెండు వందల యాభై వరకు చార్జీ వసూలు చేస్తాయి. ఇందులో కొంత మొత్తం ఇన్సూరెన్స్ కోసం బ్యాంకులు చెల్లిస్తాయి. సిల్వర్, గోల్డ్, ప్లాటినం పేరుతో ఏటీఎం కార్డులను బ్యాంకులు జారీ చేస్తాయి. డెబిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసిన వస్తువులు చోరీకి గురైనా కూడా ఇన్సూరెన్స్ ను క్లైయిమ్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories