మొబైల్‌ నెంబర్‌ విషయంలో నిర్లక్ష్యం వద్దు.. వెంటనే బ్యాంకుని సంప్రదించండి..!

Frauds Through Fake Mobile Numbers Customers Should Know These Things for Sure
x

మొబైల్‌ నెంబర్‌ విషయంలో నిర్లక్ష్యం వద్దు.. వెంటనే బ్యాంకుని సంప్రదించండి..!

Highlights

Customers Alert: ఈ రోజుల్లో ఆధార్‌ నుంచి బ్యాంక్‌ ఖాతావరకు అన్నిటికి ఫోన్‌ నెంబర్‌ లింక్‌ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది.

Customers Alert: ఈ రోజుల్లో ఆధార్‌ నుంచి బ్యాంక్‌ ఖాతావరకు అన్నిటికి ఫోన్‌ నెంబర్‌ లింక్‌ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే మీకు కావలసిన సమాచారాన్ని మెస్సేజ్‌ రూపంలో తెలియజేస్తుంది. అంతేకాకుండా ఎటువంటి మోసాలు జరగకుండా ఉంటుంది. అందుకే ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌, రేషన్ కార్డు, పాన్‌కార్డు ఇలా అన్నిటికి మొబైల్ నెంబర్ లింక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకసారి ఒక నెంబర్‌ బ్యాంక్‌ అకౌంట్‌తో లింక్‌ అయి ఉంటే పర్వాలేదు కానీ మీరు ఫోన్‌ నెంబర్‌ మార్చినట్లయితే వెంటనే బ్యాంకులో తెలియజేయాలి. లేదంటే భారీనష్టం జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం నకిలీ మొబైల్ నంబర్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయి. మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సైబర్ నేరగాళ్లు మీ మొత్తం ఖాతాను ఖాళీ చేసే అవకాశం ఉంది. బ్యాంకుకు లింక్ అయిన వున్న మొబైల్ నంబర్ ఇప్పుడు లేకుంటే గనుక వీలైనంత త్వరగా దాన్ని తీసివేసి, కొత్త నంబర్‌ను లింక్ చేసుకోండి. ఎందుకంటే మూడు నెలల తర్వాత క్లోజ్డ్ చేసిన నంబర్ ను మరొకరికి కేటాయిస్తారు. ఇది మోసానికి అవకాశమిస్తుంది.

మీ బ్యాంకు ఖాతాకు నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే మీ మొబైల్ లేదా కంప్యూటర్ సహాయంతో ఇంట్లో కూర్చొని బ్యాంకు ఖాతా మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేకపోతే, మీరు బ్యాంకుకు వెళ్లి మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. మీరు మీ బ్యాంక్ బ్రాంచ్ ను సందర్శించి, అక్కడ మొబైల్ నంబర్ మార్పు ఫామ్‌ను నింపి వారికి ఇవ్వాలి. దీంతో పాటు మీ పాస్‌బుక్, ఆధార్ కార్డు ఫోటోకాపీలను వారికివ్వాలి. దీని తర్వాత బ్యాంకు మీ మొబైల్‌ని మారుస్తుంది.

ఎటిఎం నుంచి కూడా మీ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. అయితే దీనికి మీరు ఇప్పటికే బ్యాంకులో నమోదు చేసుకున్న పాత నంబర్‌ను కలిగి ఉండాలి. పాత నంబర్ సరిగ్గా లేకుంటే, మీరు దాని ద్వారా మీ నంబర్‌ను మార్చలేరు. అలాగే ప్రస్తుత మొబైల్ నంబర్‌ను వెంటనే బ్యాంక్‌లో నమోదు చేసుకోవాలి. దీంతో మీ ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరిగినా, మీకు మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దీని వల్ల మోసాల నుంచి బయటపడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories