ఈ ప్రభుత్వ పథకం కింద 3లక్షల రుణం లభిస్తుంది.. వీరు మాత్రమే అర్హులు..!

ఈ ప్రభుత్వ పథకం కింద 3లక్షల రుణం లభిస్తుంది.. వీరు మాత్రమే అర్హులు..!
x

ఈ ప్రభుత్వ పథకం కింద 3లక్షల రుణం లభిస్తుంది.. వీరు మాత్రమే అర్హులు..!

Highlights

Kisan Credit Card Yojana: మీరు రైతు అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి రూ. 3 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు.

Kisan Credit Card Yojana: మీరు రైతు అయితే కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) ఉన్నట్లయితే ప్రభుత్వం నుంచి రూ. 3 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. రైతులకు వ్యవసాయ అవసరాలకు అవసరమైనప్పుడు రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ( కెసిసి స్కీమ్ ) అమలు చేస్తోంది . దీని కింద రైతులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. డిపాజిట్‌పై 3 శాతం వరకు వడ్డీ రేటు, రాయితీ కూడా అందిస్తోంది. దేశంలో కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని పెద్ద సంఖ్యలో రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఈ పథకం కింద 18 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతి రైతు లబ్ధి పొందవచ్చు. ఈ పథకంలో ఎరువు-విత్తనాలు, వ్యవసాయ యంత్రాలు, చేపల పెంపకం, పశుపోషణ వంటి అనేక రకాల వ్యవసాయ సంబంధిత పనులకు రుణాలు ఇస్తారు. రైతులకు గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణాలు మంజూరుచేస్తారు. లోన్ మొత్తంపై గరిష్టంగా 7 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తే వడ్డీ రేటులో 3% రాయితీ ఇస్తారు.

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా భారత ప్రభుత్వం మే 2020లో రూ. 2 లక్షల కోట్ల రుణంతో రైతులను కేసీసీ పథకం కింద కవర్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, సాధారణ ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి కేసీసీ ఉపయోగపడుతుంది. దీని ద్వారా వడ్డీ వ్యాపారుల నుంచి రైతులను రక్షిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఇప్పుడు పీఎం కిసాన్ యోజనలో విలీనం అయింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఫారమ్ PM కిసాన్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది.

కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి, దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ఫోటోతో పాటు వ్యవసాయానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. KCC ద్వారా లోన్ పొందడానికి దరఖాస్తుదారు SBI వెబ్‌సైట్ నుంచి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా SBI బ్రాంచ్ నుంచి ఫారమ్‌ని పొందవచ్చు. అభ్యర్థించిన సమాచారాన్ని పూరించి, ఫారమ్‌ను సమర్పించిన తర్వాత ఖాతా ఓపెన్‌ అవుతుంది. ఇందులోకి రుణం బదిలీ అవుతుంది. HDFC బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లేదా ఫెడరల్ బ్యాంక్ KCC పథకం కింద రుణం ఇస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories