Stock Market: స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు

Stock Market: 36.45 పాయింట్ల మేర లాభపడ్డ సెన్కె

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 19 Jun 2024 7:14 PM IST
Extreme fluctuations in the stock market
X

Stock Market: స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే జోరును కొనసాగించలేకపోయాయి. కొత్త గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. నేటి ట్రేడింగ్‌ను సూచీలు మిశ్రమంగా ముగించాయి. సెన్సెక్స్‌ 36 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడేలో 76 వేల 954 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 36.45 పాయింట్ల స్వల్ప లాభంతో 77 వేల 337 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 41.90 పాయింట్లు నష్టపోయి 23 వేల 516 వద్ద స్థిరపడింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story