Commodity Prices: కాకరేపుతున్న కందిపప్పు, ఎండుమిర్చి.. కిలో నూనెపై రూ. 50 పెరుగుదల! కూరగాయల మార్కెట్ తాజా రేట్లు ఇవే..

Commodity Prices: సామాన్యుడి వంటింట్లో ధరల మంట పుడుతోంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి.. ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు షాక్ ఇస్తున్నాయి.

Arun Chilukuri
Published on: 3 Feb 2026 11:42 AM IST
Commodity Prices: కాకరేపుతున్న కందిపప్పు, ఎండుమిర్చి.. కిలో నూనెపై రూ. 50 పెరుగుదల! కూరగాయల మార్కెట్ తాజా రేట్లు ఇవే..
X

Commodity Prices: సామాన్యుడి వంటింట్లో ధరల మంట పుడుతోంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి.. ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు షాక్ ఇస్తున్నాయి. పప్పులు, వంటనూనెలు, ఎండుమిర్చి ఇలా ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతుండటంతో నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. విశేషమేమిటంటే, ఎటువంటి పండుగలు లేకపోయినా ఈ స్థాయిలో ధరలు పెరగడం గమనార్హం.

నూనె ధరల సెగ.. ప్యాకెట్ సైజుల్లో కోత!

వంటనూనెల ధరలు నెల రోజుల్లోనే లీటరుకు సుమారు రూ. 50 వరకు పెరిగాయి. దీంతో నూనె తయారీ కంపెనీలు సామాన్యుడి కళ్లుగప్పేందుకు కొత్త ఎత్తుగడ వేశాయి. ధరను పెంచకుండా ఉండటానికి, లీటర్ ప్యాకెట్‌ స్థానంలో 910ml, 850ml, 800ml పరిమాణాల్లో ప్యాకెట్లను మార్కెట్లోకి వదులుతున్నాయి.

ప్రస్తుత ధరల విశ్లేషణ:

సన్‌ఫ్లవర్ ఆయిల్: జనవరిలో ₹150 ఉన్న ధర ఇప్పుడు ₹167 కు చేరింది.

వేరుశెనగ నూనె: కిందటి నెలలో ₹160 ఉండగా, ప్రస్తుతం ₹180 కి పెరిగింది.

పామాయిల్: 850 గ్రాముల ప్యాకెట్ ధర ₹120 వద్ద కొనసాగుతోంది.

పప్పులు, దినుసుల ధరలు పైపైకే..

కేవలం నూనెలనే కాదు, నిత్యం వాడే పప్పులు, పోపు దినుసుల ధరలు కూడా భారీగా పెరిగాయి.

కందిపప్పు: కేజీ రూ. 110 నుంచి ₹130 కి చేరింది.

వేరుశనగ పలుకులు: వారం క్రితం ₹140 ఉండగా, ఇప్పుడు ఏకంగా ₹200 పలుకుతోంది.

ఎండుమిర్చి: కిలో రూ. 240 నుంచి ₹300 కు పెరగడం సామాన్యుడిని ఆందోళనకు గురిచేస్తోంది.

మార్కెట్‌లో కూరగాయల ధరలు ఇలా..

హైదరాబాద్‌లోని పటాన్‌చెర్వు మార్కెట్ యార్డ్ గణాంకాల ప్రకారం.. టమాటా, వంకాయ వంటివి కొంత ఊరటనిస్తున్నా, దొండకాయ, బీరకాయ ధరలు మండిపోతున్నాయి.

దొండకాయ: ₹60 (కిలో)

బీరకాయ / క్యాప్సికమ్: ₹50

మిర్చి: ₹60

టమాటా / వంకాయ: ₹20

ఈ ధరల పెరుగుదలతో రోజువారీ కూలీలు, మధ్యతరగతి ప్రజలు 'ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు' అంటూ వాపోతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story