దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన దూకుడు..

Arun Chilukuri
Published on: 3 Dec 2020 11:49 AM IST
దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన దూకుడు..
X

దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 190 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 13,170 వద్దకు చేరింది. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్‌ 143 పాయింట్లు ఎగసి 44,761 వద్దకు చేరగా జాతీయ స్టాక్ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 13,165 వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ పరపతి విధాన కమిటీ తాజా సమీక్షలో ద్రవ్య లభ్యత మరింత మెరుగుపడ్డానికి తగిన చర్యలను ప్రకటించవచ్చన్న అంచనాలు మార్కెట్ల జోరుకు కారణమవుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story