PM kisan: రైతులకి అలర్ట్‌.. పీఎం కిసాన్‌ పథకంలో 8 మార్పులు గమనించారా..!

Eight Changes in PM Kisan Scheme if you Dont Update you Will Lose
x

PM kisan: రైతులకి అలర్ట్‌.. పీఎం కిసాన్‌ పథకంలో 8 మార్పులు గమనించారా..!

Highlights

PM Kisan: మీరు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులైతే ఈ వార్త మీ కోసమే.

PM Kisan: మీరు పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులైతే ఈ వార్త మీ కోసమే. ఈ పథకంలో ప్రభుత్వం 8 మార్పులు చేసింది. వీటిని అప్‌డేట్‌ చేయకుంటే మీరు కూడా తప్పుగా డబ్బులు తీసుకున్న నకిలీ జాబితాలో చేరుతారు. దీనివల్ల ఇప్పటి వరకు తీసుకున్న అన్ని వాయిదాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అందుకే ఒక్కసారి రైతులు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించుకోండి. ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే అప్‌డేట్‌ చేయండి.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటి వరకు 11వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లోకి చేరింది. ఇప్పుడు 12వ విడత ప్రయోజనాన్ని పొందడానికి అనేక పత్రాలను కలిగి ఉండటం తప్పనిసరి చేసింది. వాస్తవానికి చాలా మంది అనర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఈ పథకం నిబంధనలను మార్చింది. తద్వారా నకిలీ లబ్ధిదారులని గుర్తించే పనిలో ఉంది. ఇటీవల లబ్ధిదారులు ఈ-కెవైసి చేయడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ మార్పులు చేసింది. దీని కింద అనర్హులని గుర్తించి డబ్బు వసూలు చేస్తుంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని చాలా మంది పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ వాయిదాలు తీసుకుంటున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ పథకం నిబంధనల ప్రకారం భార్యాభర్తలు కలిసి జీవిస్తున్నట్లయితే, కుటుంబంలోని పిల్లలు మైనర్లు అయితే ఈ పథకం ప్రయోజనం కేవలం ఒకరికి మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు అలాంటి నకిలీ రైతులకి ప్రభుత్వం నోటీసులు పంపుతోంది. మీరు ఇలాంటి పొరపాటుకు పాల్పడినట్లయితే తప్పుగా తీసుకున్న మొత్తాన్ని స్వచ్ఛందంగా తిరిగి చెల్లించండి. దీని కోసం ప్రభుత్వం పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓ సదుపాయాన్ని కల్పించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories