E Shram Card: ఈ శ్రమ్‌కార్డు వారికి ఒక వరం.. బెనిఫిట్స్‌ తెలిస్తే అస్సలు వదలరు..!

E Shram Card Benefits and Registration Check for all Details
x

E Shram Card: ఈ శ్రమ్‌కార్డు వారికి ఒక వరం.. బెనిఫిట్స్‌ తెలిస్తే అస్సలు వదలరు..!

Highlights

E Shram Card: దేశంలో అసంఘటిత రంగంలో అధిక సంఖ్యలో ప్రజలు పనిచేస్తున్నారు.

E Shram Card: దేశంలో అసంఘటిత రంగంలో అధిక సంఖ్యలో ప్రజలు పనిచేస్తున్నారు. వారికోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోంది. వాటిలో ఒకటి ఈ-శ్రామ్ కార్డ్ స్కీమ్. కరోనా తర్వాత కార్మికుల వలసల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీనికింద ప్రభుత్వం కార్మికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రతి కార్డుదారునికి రూ.2 లక్షల బీమా అందిస్తోంది. దీంతో పాటు ఈ కార్డు హోల్డర్లు కార్మిక మంత్రిత్వ శాఖ పథకాల ప్రయోజనాలను కూడా పొందుతారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..

ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, రిక్షా పుల్లర్లు, భవన నిర్మాణ కార్మికులు ఈ-శ్రమ్ కార్డ్ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి వయస్సు 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు ఈ పథకం కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దేశం నలుమూలల నుంచి దాదాపు 28 కోట్ల మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు.

దేశంలోని దాదాపు 38 కోట్ల మంది కార్మికులను ఈ పథకంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సంఘటిత రంగంలో పనిచేసే వారు అలాగే EPFO ఖాతాదారులుగా ఉన్నవారు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోలేరు. దీంతో పాటు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకం కోసం దరఖాస్తు చేయలేరు. అంతేకాకుండా NPS / EPFO లబ్దిదారులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు.

ఈ-శ్రమ్ దరఖాస్తు ప్రక్రియ

1. మొదటగా eshram.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

2. తర్వాత eSHRAMలో రిజిస్టర్ లింక్‌ని ఓపెన్‌ చేయాలి.

3. తర్వాత మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేసి క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. తర్వాత OTPని ఎంటర్‌ చేయాలి.

4. అన్ని వివరాలను నింపిన తర్వాత ఫారమ్‌ను సమర్పించాలి.

5. ఈ-శ్రమ్ యోజన కోసం ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ అవసరమవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories