భారతదేశంలో అరుదైన రూ.1 లక్ష నోటు ముద్రించారని మీకు తెలుసా? దానిపై ఎవరి బొమ్మ ఉందంటే?

During the Reign of Netaji Subhash Chandra Boses Azad Hind Government one Lakh Rupee Note was Introduced
x

భారతదేశంలో అరుదైన రూ.1 లక్ష నోటు ముద్రించారని మీకు తెలుసా? దానిపై ఎవరి బొమ్మ ఉందంటే?

Highlights

One Lakh Rupees Note: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల నోటు వచ్చింది. ఈ నోటుపై మహాత్మా గాంధీ బొమ్మ లేదు. కానీ..

One Lakh Rupees Note: ఇప్పటి వరకు మీరు 2000 రూపాయల నోటును మీ జీవితంలో అతి పెద్ద నోటుగా చూసి ఉంటారు. కానీ, భారతదేశంలో అతిపెద్ద నోటు 2 వేలు కాదు రూ.1 లక్ష అని చెబితే, మీరు నమ్ముతారా.. నిజమే.. ఒకప్పుడు ఇండియాలో లక్ష రూపాయల నోటు కూడా ప్రింట్ అయ్యేది. దీని గురించి చాలామంది వినే ఉంటారు. చాలామంది చూసి ఉండరు. అందుకే మీకు లక్ష రూపాయల నోటును చూపిద్దామని ఈ న్యూస్ మీకోసం తీసుకొచ్చాం.

రూ.లక్ష నోటు ఎప్పుడు, ఎందుకు వచ్చింది?

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల నోటు వచ్చింది. ఈ నోటుపై మహాత్మా గాంధీ బొమ్మ లేదు. కానీ, సుభాష్ చంద్రబోస్ ఫొటోతో ముద్రించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆజాద్ హింద్ బ్యాంక్ ఈ నోట్‌ను జారీ చేసింది. ఈ బ్యాంకును కూడా నేతాజు సుభాష్ చంద్రబోస్ స్థాపించారు. ఇది బర్మాలోని రంగూన్‌లో ఉంది. ఈ బ్యాంకును బ్యాంక్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తారు. ఈ బ్యాంకు ప్రత్యేకంగా విరాళాలు సేకరించడానికి సృష్టించారు. ఇది భారతదేశానికి బ్రిటిష్ రాజ్యం నుంచి విముక్తి కలిగించడానికి రూపొందించారు. అదే సమయంలో రూ.లక్ష నోటును విడుదల చేసిన ఆజాద్ హింద్ బ్యాంకుకు ప్రపంచంలోని 10 దేశాల మద్దతు లభించగా.. ఆజాద్ హింద్ ప్రభుత్వానికి మద్దతుగా బర్మా, జర్మనీ, చైనా, మంచుకువో, ఇటలీ, థాయ్ లాండ్, ఫిలిప్పీన్స్ లేదా ఐర్లాండ్ బ్యాంక్ కరెన్సీని గుర్తించింది.

నేతాజీ డ్రైవర్ లక్ష నోటు గురించి సమాచారం ఇచ్చాడు..

రూ.5000 నోటుకు సంబంధించిన సమాచారాన్ని ఆజాద్ హింద్ బ్యాంక్ పబ్లిక్‌గా అందించిందని, అందులో ఒక నోటు ఇప్పటికీ BHUలోని భారత్ కళా భవన్‌లో సురక్షితంగా ఉంది. మరోవైపు నేతాజీకి డ్రైవర్‌గా ఉన్న కల్నల్ నిజాముద్దీన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో లక్ష నోటు గురించి చెప్పాడు. ఇది కాకుండా, నేతాజీ ముని మనవరాలు రాజ్యశ్రీ చౌదరి ఇటీవల విశాల్ భారత్ సంస్థాన్‌కు లక్ష నోటు చిత్రాన్ని అందుబాటులో ఉంచడంతో ఈ విషయం మరింత ధృవీకరించినట్లైంది.


Show Full Article
Print Article
Next Story
More Stories