Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన తర్వాత ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Dont Make These Mistakes After Making Fixed Deposit
x

Fixed Deposit: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన తర్వాత ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

Highlights

Fixed Deposit: నేటికాలంలో డబ్బులు పెట్టుబడి పెట్టడానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి.

Fixed Deposit: నేటికాలంలో డబ్బులు పెట్టుబడి పెట్టడానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్‌ చేసి మంచి రాబడిని పొందవచ్చు. అయినప్పటికీ ప్రజలు సురక్షితంగా ఉండే పెట్టుబడులని మాత్రమే ఎంచుకుంటారు. అందులో అత్యంత ముఖ్యమైనది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌. దీనిపై స్థిర వడ్డీ రేటుతో రాబడిని పొందవచ్చు. కానీ ఒక్కసారి ఎఫ్‌డి చేసిన తర్వాత పొరపాటు చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.

ఎఫ్డీ అనేది దేశంలోని సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో ఒకటి. ఎందుకంటే ఇది రిస్క్ లేనిది రాబడికి హామీనిచ్చేది. ఖాతాదారుడు నిర్ణీత వ్యవధిలో నిర్ణీత మొత్తాన్ని ఖాతాలో డిపాజిట్ చేసి దానిపై వడ్డీని పొందే పెట్టుబడి ఎంపిక ఇది. FDలో డిపాజిట్ చేసిన మొత్తం లాక్ చేయబడి ఉంటుంది. ఈ లాక్-ఇన్ పీరియడ్‌ని డిపాజిట్‌ చేసే వ్యక్తి మాత్రమే ఎంచుకుంటాడు. అయితే కొన్నిసార్లు FDలని మెచ్యూరిటీకి ముందే విత్‌ డ్రా చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ప్రజలకి నష్టం జరుగుతుంది.

ప్రజలకు అకస్మాత్తుగా డబ్బు అవసరం వచ్చినప్పుడు ఏమీ ఆలోచించకుండా FDని విత్‌ డ్రా చేస్తారు. అయితే మెచ్యూరిటీకి ముందు విత్‌ డ్రా చేయడం వల్ల పెనాల్టీ ఎదుర్కోవల్సి ఉంటుంది. FD నుంచి అకాల ఉపసంహరణ చేయవచ్చు. కానీ సదరు వ్యక్తి పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. దీని కారణంగా FDపై వచ్చే వడ్డీ తగ్గిపోతుంది. మరోవైపు ముందుగానే FDని క్లోజ్‌ చేయడం వల్ల చాలా బ్యాంకులు వడ్డీ రేటులో 0.5% నుంచి 1.00% మధ్య జరిమానా విధిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories