Stock Market: ఇవాళ కోలుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 2వేల 5వందల పాయింట్ల మేర లాభం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Jun 2024 9:28 PM IST
Domestic stock markets recovered today
X

Stock Market: ఇవాళ కోలుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు 

Stock Market: సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడడంతో భారీ నష్టాలు మూటగట్టుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ కోలుకోవడమే కాకుండా భారీ లాభాలను నమోదు చేశాయి. చరిత్రలోనే అతిపెద్ద నష్టంతో షాక్‌లోకి జారుకున్న ఇన్వెస్టర్లకు... ఓ విధంగా కోలుకునే అవకాశం లభించింది. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోయినా.. మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవడంతో సూచీలు రాణించాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 2వేల 5వందల పాయింట్ల మేర లాభపడి.. తిరిగి తన 74వేల మార్కును నిలబెట్టుకుంది. నిఫ్టీ 22వేల 600 పాయింట్ల ఎగువన ముగిసింది. ముఖ్యంగా HDFC బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ వంటి షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story