Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 384, నిఫ్టీ 148 పాయింట్ల లాభం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 Sept 2024 10:00 PM IST
Domestic stock markets ended with gains
X

Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ తొలిసారి రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 85వేల పాయింట్లకు చేరువ కాగా... నిఫ్టీ 26వేల పాయింట్లకు చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుందన్న వార్తలు స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపునిచ్చింది. ఈ క్రమంలో ఆల్‌ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 84,651 పాయింట్లతో లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 84,607పాియంట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్... అత్యధికంగా 84,980 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది.

చివరకు 384 పాయింట్ల లాభంతో 84,928వద్ద ముగిసింది. నిఫ్టీ 25,872 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 25,847 పాయింట్లు తగ్గిన నిఫ్టీ... గరిష్టంగా 25,956 పాయింట్లకు చేరింది. చివరకు 148 పాయింట్ల లాభంతో 25,939 పాయింట్ల వద్ద స్థిరపడింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story