Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల పరుగు

Stock Market: 141 పాయింట్లు లాభపడ్డ సెన్కెక్స్

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 20 Jun 2024 10:15 PM IST
Domestic stock markets are on a profit run
X

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల పరుగు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్ల లాభాల పరుగు కొనసాగుతోంది. తీవ్ర ఒడుదొడుకులు ఉన్నప్పటికీ వరుసగా ఆరో రోజూ సెన్సెక్స్‌ లాభాలను దక్కించుకుంది. క్రితం సెషన్‌లో గరిష్ఠాల నుంచి వెనక్కి వచ్చిన నిఫ్టీ మళ్లీ పుంజుకుంది. 77 వేల 554 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 77 వేల 643 గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఒక దశలో 77 వేల 100 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. సూచీ చివరకు 141.34 పాయింట్ల లాభంతో 77 వేల 478 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి 23 వేల 567 వద్ద స్థిరపడింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story