Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

Stock Market: సెన్సెక్స్ 277, నిఫ్టీ 96 పాయింట్ల లాభం

Shekhar G
Updated on: 14 Feb 2024 9:15 PM IST
Domestic Stock Market Indices Ended In Gains
X

Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు 

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల బాటపట్టాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ ఏకంగా వెయ్యి పాయింట్ల మేర పుంజుకుంది. సెన్సెక్స్‌ 71,035 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 70,809 వద్ద కనిష్ఠాన్ని తాకింది. దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు నష్టాల్లో కొనసాగిన సూచీ.. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో భారీగా పుంజుకుంది. చివరికి 277 పాయింట్ల లాభంతో 71,833 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్ల లాభంతో 21,840 వద్ద స్థిరపడింది.

Shekhar G

Shekhar G

Next Story