Cheapest Petrol: ప్రపంచంలోనే తక్కువ ధరకు పెట్రోల్.. బిస్కెట్ ప్యాకెట్ కంటే తక్కువే.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Do you Know Where to get the Cheapest Petrol Sold in the World Check Top 10 Countries Check Here
x

Cheapest Petrol: ప్రపంచంలోనే తక్కువ ధరకు పెట్రోల్.. బిస్కెట్ ప్యాకెట్ కంటే తక్కువే.. ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Highlights

Cheapest Petrol in the World: పెట్రోలు, డీజిల్ ధరల వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. దీంతో మధ్యతరగతి ఇంటి బడ్జెట్ కూడా దిగజారుతుంది. అయితే బిస్కెట్ కంటే పెట్రోల్ తక్కువ ధరకే లభించే దేశం ఏంటో తెలుసా?

Petrol Price Latest Update: మన దేశంలో పెట్రోల్ ధర దాదాపు రూ.100 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడం వల్ల భారత్‌లో పెట్రోలు ధరలు తగ్గుతాయని ఇంతకు ముందు భావించేవారు. కానీ అలా ఏం జరగడం లేదు. ఇటువంటి పరిస్థితిలో బిక్సెట్ కంటే పెట్రోల్ చౌకగా లభించే ప్రదేశం ప్రపంచంలో ఉందని మీకు తెలుసా. ప్రజలు బిస్కెట్ ప్యాకెట్ ధరకే తమ కారు ట్యాంక్‌ని నింపుకోవచ్చు. ప్రపంచంలో పెట్రోల్‌ను అతి తక్కువ ధరకు అమ్ముతున్న టాప్-10 దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సూడాన్‌లో పెట్రోల్ ధర..

సుడాన్ చౌకైన పెట్రోల్‌ను విక్రయించే ఈ దేశాల సిరీస్‌లో 10వ స్థానంలో ఉంది. GlobalPetrolPrice.com నివేదించిన ప్రకారం సుడాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.51.08లు మాత్రమే. ఈ దేశంలో పెట్రోలియం బావులు చాలా ఉన్నాయి. ఇతర దేశాలకు చమురును అమ్మడం ద్వారా ఈ దేశం తన ఆర్థిక వ్యవస్థను నడుపుతోంది.

ఈ జాబితాలో, చౌకైన పెట్రోల్‌ను విక్రయించే టాప్-10 దేశాల్లో తొమ్మిదో స్థానంలో ఖతార్ ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.42.84లుగా నిలిచింది. కజకిస్థాన్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.33.11గా ఉంది. ఈ జాబితాలో ఈ దేశం 8వ స్థానంలో ఉంది.

తుర్క్‌మెనిస్తాన్‌లో పెట్రోలు ధర..

Global Petrol Price.com నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్య ఆసియా దేశమైన తుర్క్‌మెనిస్తాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 31.85లుగా ఉంది. ఈ జాబితాలో ఈ దేశం 7వ స్థానంలో ఉంది. లీటరు పెట్రోలు ధర రూ.29.85కి విక్రయించడం ద్వారా నైజీరియా ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఈ దేశం కూడా భారతదేశానికి పెద్ద మొత్తంలో పెట్రోల్‌ను విక్రయిస్తుంది.

కువైట్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.25.91లుగా నిలిచింది. ఈ జాబితాలో 5 వ స్థానంలో నిలిచింది. అల్జీరియాలో లీటరు పెట్రోల్ ధర రూ. 25.24లతో నాలుగో స్థానంలో ఉంది. ఆఫ్రికా దేశమైన అంగోలాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.18.56గా ఉంది. ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

దేశంలోనే అతి తక్కువ ధరకే పెట్రోల్‌ ఎక్కడంటే?

ప్రపంచంలో అత్యంత చౌకైన పెట్రోల్‌ను విక్రయించే దేశాల జాబితాలో ఇరాన్ రెండవ స్థానంలో ఉంది. అక్కడ పెట్రోలు లీటరు రూ.4.45కి విక్రయిస్తున్నారు. ప్రపంచంలో బిస్కెట్ కంటే పెట్రోల్ ఎక్కడ తక్కువ ధరకు అమ్ముడవుతుందో ఇప్పుడు చూద్దాం.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్‌ను సౌదీ అరేబియా లేదా యూఏఈలో మాత్రం విక్రయించడం లేదు. ఆ దేశం పేరు వెనిజులాలో విక్రయిస్తున్నారు. అక్కడ లీటరు పెట్రోలు రూ.1.48కి అమ్ముతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories