Train Horns: చైన్ లాగితే ఎలాంటి సిగ్నల్ వస్తుందో తెలుసా.. ట్రైన్ డ్రైవర్ ఇచ్చే 11 హారన్‌ల అర్థమిదే?

Train Horns: చైన్ లాగితే ఎలాంటి సిగ్నల్ వస్తుందో తెలుసా.. ట్రైన్ డ్రైవర్ ఇచ్చే 11 హారన్‌ల అర్థమిదే?
x
Highlights

Train Horns and Types: రైలు నుంచి ఆరుసార్లు షార్ట్ హారన్ మోగినప్పుడు.. రైలు ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుందని అర్థం చేసుకోవాలి.

Train Horns and Meaning: మీరు రైలు హారన్‌ని వినే ఉంటారు. శక్తివంతమైన ఎయిర్ హార్న్ అయిన రైలు హారన్, రైల్వే గార్డ్‌లు, సిబ్బంది, ప్రయాణీకులకు వినిపించే హెచ్చరిక పరికరంగా పనిచేస్తుంది. ఇది రైలు రాక లేదా నిష్క్రమణను సూచించడమే కాకుండా, ప్రతి హారన్, దాని వ్యవధి వెనుక వేరే అర్థం ఉంటుంది. ప్రమాద సంకేతాల నుంచి లేన్‌లను మార్చడం వరకు ప్రతి పరిస్థితికి హారన్ మోగుతుంది. కాబట్టి ఈ రోజు మనం భారతీయ రైల్వేలో వినిపించే 11 రకాల హారన్లు, వాటి అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఒక చిన్న హారన్ - తదుపరి ప్రయాణానికి బయలుదేరే ముందు డ్రైవర్ రైలును కడగడం, శుభ్రపరచడం కోసం యార్డ్‌కు తీసుకువెళతాడని ఒక చిన్న హారన్ సంకేతాలు ఇస్తుంది.

2. రెండు చిన్న హారన్లు - డ్రైవర్ రెండు చిన్న హార్న్‌లు ఊదినట్లయితే, అతను రైలును స్టార్ట్ చేయమని రైల్వే సిగ్నల్‌కు సూచించమని గార్డును అడుగుతున్నట్లు సమాచారం.

3. మూడు చిన్న హారన్‌లు - చాలా అరుదుగా కనిపించే మూడు చిన్న హారన్‌లు అంటే డ్రైవర్ మోటారుపై నియంత్రణ కోల్పోయాడని అర్థం. గార్డు వెంటనే వాక్యూమ్ బ్రేక్‌ని లాగడానికి ఇది సిగ్నల్ ఇచ్చినట్లు అర్థం.

4. నాలుగు చిన్న హారన్ సిగ్నల్స్ - 'సాంకేతిక సమస్య' ఉంటే, డ్రైవర్ నాలుగు చిన్న సిగ్నల్స్‌ ఇస్తాడు. దీని వల్ల రైలు ముందుకు వెళ్లదు.

5. నిరంతరంగా హారన్ - రైలు ఆగకుండా స్టేషన్ల గుండా వెళుతుందని ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి నిరంతర హారన్ ఇస్తుంటారు.

6. ఒక లాంగ్ హారన్ వెంటనే ఒక చిన్న హారన్ - ఇది ఇంజిన్‌ను ప్రారంభించే ముందు బ్రేక్ పైప్ సిస్టమ్‌ను సెట్ చేయడానికి గార్డుకు సూచించడానికి ఉద్దేశించినది.

7. రెండు లాంగ్, రెండు షార్ట్ సిగ్నల్స్ - డ్రైవర్ రెండు పొడవాటి, రెండు పొట్టి సిగ్నల్స్‌ ఇస్తే.. అతను ఇంజిన్‌ను నియంత్రించమని గార్డుకు సంకేతాలు ఇస్తున్నాడని అర్థం.

8. రెండు స్టాప్‌లతో కూడిన రెండు హార్న్‌లు - రైలు రైల్వే క్రాసింగ్ గుండా వెళ్లబోతుంటే, ఈ సిగ్నల్ బాటసారులను అప్రమత్తం చేయడానికి ఉపయోగిస్తుంటారు.

9. రెండు లాంగ్, షార్ట్ హార్నన్స్ - డ్రైవర్ రైలు ట్రాక్‌ను మార్చబోతున్నప్పుడల్లా ఈ హారన్ ఇస్తుంటారు.

10. రెండు షార్ట్, ఒక లాంగ్ హారన్ - ఇది రెండు అవకాశాలను సూచిస్తుంది. ఇందులో ప్రయాణీకుడు చైన్‌ని లాగడం లేదా గార్డు వాక్యూమ్ బ్రేక్‌ని లాగడం వంటివి అని అర్థం చేసుకోవాలి.

11. ఆరుసార్లు షార్ట్ హార్న్- ఇది రైలు ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకుందని అర్థం.

Show Full Article
Print Article
Next Story
More Stories