Home Loan: హోమ్‌లోన్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయవద్దు.. చాలా నష్టపోతారు..!

Do Not Make These Mistakes In Case Of Home Loan You Will Lose A Lot
x

Home Loan: హోమ్‌లోన్‌ విషయంలో ఈ పొరపాట్లు చేయవద్దు.. చాలా నష్టపోతారు..!

Highlights

Home Loan: సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఇది కొంతమందికే సాధ్యమవుతుంది. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితేనే దీనిని సాధించవచ్చు.

Home Loan: సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఇది కొంతమందికే సాధ్యమవుతుంది. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితేనే దీనిని సాధించవచ్చు. మొదటిసారి ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నప్పుడు బడ్జెట్ తక్కువగా ఉంటే చాలామంది గృహ రుణం తీసుకుంటారు. ఇది మంచిదే కానీ హోమ్ లోన్ తీసుకునే ముందు చాలా విషయాలను గమనించాలి. హోమ్ లోన్ నెలవారీ ఈఎంఐని క్రమం తప్పకుండా చెల్లించగలిగితే, ఎటువంటి ఒత్తిడి లేకుండా డౌన్ పేమెంట్ చేయగలిగితే హోమ్ లోన్ తీసుకోవాలి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి

గృహ రుణం తీసుకునేటప్పుడు సమీపంలోని రుణదాతలు, బ్యాంకుల నుంచి గృహ రుణంపై వడ్డీ రేటును తెలుసుకోండి. EMI రేట్ల గురించి సమాచారాన్ని సేకరించండి. మీ అవసరాలకు అనుగుణంగా హోమ్ లోన్ ఇచ్చే రుణదాత లేదా బ్యాంకును ఎంచుకోండి. మీరు నివసించడానికి బడ్జెట్‌కు అనుగుణంగా ఉండే స్థలంలో ఇల్లు కొనండి.

ఈ పథకం ప్రయోజనం పొందవచ్చు

మీరు గృహ రుణం తీసుకోవడానికి అఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లోన్‌ తీసుకోవచ్చు. ముందుగా డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు కొనుగోలు చేస్తున్న ఆస్తి మొత్తం ధరలో 10 శాతం నుంచి 25 శాతం వరకు ఉంటుంది. ఉదాహరణకు రూ. 40 లక్షలతో ఇల్లు కొంటున్నారనుకోండి దానిపై 20 శాతం డౌన్ పేమెంట్ చెల్లించాలి అంటే రూ. 8 లక్షలను డౌన్ పేమెంట్‌గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని EMI విధానంలో చెల్లించవచ్చు. కానీ మరింత వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు అన్ని పేపర్లను జాగ్రత్తగా చదివి ఆపై మాత్రమే లోన్‌ తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories