Business Idea: ఇల్లు కదలకుండానే.. వేలల్లో ఆదాయం, బెస్ట్‌ బిజినెస్‌..!

Business Idea: వ్యాపారం చేయాలనే ఆలోచన మనలో చాలా మందికి ఉంటుంది. అయితే నష్టాలు వస్తాయన్న భయం, పెట్టుబడి పెట్టడానికి వెనుకడుగు వేస్తుంటారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Oct 2024 3:10 PM IST
Dhoop Cups Making Business Ideas in Telugu Check Here for Full Details
X

Business Idea: ఇల్లు కదలకుండానే.. వేలల్లో ఆదాయం, బెస్ట్‌ బిజినెస్‌..!

Business Idea: వ్యాపారం చేయాలనే ఆలోచన మనలో చాలా మందికి ఉంటుంది. అయితే నష్టాలు వస్తాయన్న భయం, పెట్టుబడి పెట్టడానికి వెనుకడుగు వేస్తుంటారు. దీంతో వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్నా ఆ ఆలోచనను విరమించుకుంటారు. అయితే వినూత్నమైన ఆలోచనలు, మార్కెట్‌ అవసరాలను అనుగుణంగా ముందుకు వెళ్తే మంచి లాభాలను ఆర్జించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఇల్లు కూడా కదలకుండా, ఇంట్లోనే ఉంటూ లాభాలు ఆర్జించే ఎన్నో వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇల్లు కదలకుండా భారీగా డబ్బు సంపాదించే బెస్ట్ బిజినెస్‌ ప్లాన్స్‌లో దూద్‌ కప్స్‌ తయారీ ఒకటి. ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరూ వీటిని ఉపయోగిస్తున్నారు. పూజ గదుల్లో కచ్చితంగా దూద్‌ కప్స్‌ వినియోగం పెరిగింది.

ఈ నేపథ్యంలో వీటి తయారీని వ్యాపారంగా మార్చుకుంటే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందగలగడం ఈ వ్యాపారం ప్రత్యేకతగా చెప్పొచ్చు. వీటి తయారీకి ఒక మిషిన్‌తో పాటు ముడి సరుకు అవసరపడుతుంది. పొడిలా ఉండే ముడి సరుకును మిషిన్‌లో వేసి నొక్కితే చాలు వెంటనే దూద్ కప్స్‌ తయారవుతాయి.

ఇక కప్స్‌లో వేసే దూప్‌ కూడా ప్రత్యేకంగా లభిస్తుంది. ఈ దూప్‌ను అంతకుముందు తయారు చేసిన కప్స్‌లో వేస్తే దూద్‌ కప్స్‌ రడీ అయినట్లే. ఇక వీటిని మీకు నచ్చిన బ్రాండ్‌తో ప్యాకింగ్ చేసుకొని సొంతంగా విక్రయించుకోవచ్చు. మార్కెట్లో ప్రస్తుతం ఒక్కో దూద్‌ కప్స్‌ ప్యాకెట్ తక్కువలో తక్కువ రూ. 50 పలుకుతోంది. దీంతో ఈ వ్యాపారంతో మంచి లాభాలను ఆర్జించడం ఖాయం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story