Credit Cards: క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గుతుందా..బ్యాంకర్స్ ఏమన్నారంటే ?

Credit Cards
x

Credit Cards: క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గుతుందా..బ్యాంకర్స్ ఏమన్నారంటే ?

Highlights

Credit Cards: ఏ బ్యాంక్ నుంచి లోన్ లేదా క్రెడిట్ కార్డులు కావాలంటే క్రెడిట్ స్కోరు కీలక ప్రమాణంగా మారిపోయింది. దీంతో జనాలు దానిని సక్రమంగా నిర్వహించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

Credit Cards: ఏ బ్యాంక్ నుంచి లోన్ లేదా క్రెడిట్ కార్డులు కావాలంటే క్రెడిట్ స్కోరు కీలక ప్రమాణంగా మారిపోయింది. దీంతో జనాలు దానిని సక్రమంగా నిర్వహించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్నిసార్లు వారు తెలియకుండానే వారి క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటారు. వీటిలో ఒకటి పాత క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం. ఈ నిర్ణయం కొన్నిసార్లు క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేస్తుంది. పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్‌ను లెక్కించడంలో క్రెడిట్ హిస్టరీ కీలక పాత్ర పోషిస్తుంది. పాత క్రెడిట్ కార్డు లేదా లోన్ ఖాతాను మూసివేసినప్పుడు అది మీ క్రెడిట్ బ్యూరో నుంచి క్రమంగా అదృశ్యం అవుతుంది. ఇది మీ మొత్తం క్రెడిట్ హిస్టరీ లెన్త్ తగ్గించవచ్చు. దీని వలన మీ స్కోరు తగ్గవచ్చు. సుదీర్ఘమైన, మంచి క్రెడిట్ హిస్టరీ భవిష్యత్తులో రుణం లేదా క్రెడిట్ కార్డు పొందడానికి సాయపడుతుంది.

క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అనేది మీ మొత్తం క్రెడిట్ పరిమితికి వ్యతిరేకంగా మీరు ఉపయోగించే క్రెడిట్ మొత్తాన్ని సూచిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిష్పత్తిని 30% కంటే తక్కువగా ఉంచడం మంచిది. ఉదాహరణకు, మీ మొత్తం క్రెడిట్ పరిమితి రూ. 1,00,000 అయితే మీరు రూ. 30,000 వరకు ఖర్చు చేస్తే, మీ రేషియో బాగున్నట్లు. కానీ మీరు పాత క్రెడిట్ కార్డును మూసివేసి మీ మొత్తం పరిమితి రూ. 50,000కి తగ్గితే అది రేషియోను 60శాతానికి పెంచుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

పాత క్రెడిట్ ఖాతాలను మూసివేయడం వల్ల తరచుగా క్రెడిట్ స్కోరు తాత్కాలికంగా తగ్గుతుంది. ఇటీవల కొత్త ఖాతాలు తెరిచినట్లయితే ఆ వ్యక్తి ఆర్థికంగా అస్థిరంగా ఉన్నారని సూచిస్తుంది. ఇది రుణదాతల విశ్వాసాన్ని తగ్గిస్తుంది. అందుకే క్రెడిట్ కార్డును మూసివేయాల్సిన అవసరం ఉంటే, ముందుగా దాని వినియోగం, ఛార్జీలను పరిశీలించాలి. క్రెడిట్ స్కోర్‌పై తక్కువ ప్రభావం ఉండేలా కొత్తది తీసుకున్న తర్వాత మాత్రమే పాత కార్డును క్లోజ్ చేయాలి. తక్కువగా ఉపయోగించిన కార్డులను కూడా అప్పుడప్పుడు వాడండి. తద్వారా అవి ఇన్ యాక్టివ్ గా మారవు. దాని వల్ల క్రెడిట్ స్కోర్ పడిపోకుండా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories