Gas Cylinder Price: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

Cooking Gas Cylinder Price Hiked By ₹ 50
x

Gas Cylinder Price: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..!

Highlights

Gas Cylinder: వినియోగదారుల నెత్తిన మరో బండ వేశాయి ఆయిల్ కంపెనీలు.

Gas Cylinder: వినియోగదారుల నెత్తిన మరో బండ వేశాయి ఆయిల్ కంపెనీలు. సామాన్యుడికి షాకిస్తూ.. మరోసారి సిలిండర్‌ ధరలను పెంచాయి. దాదాపు 8 నెలల తర్వాత డొమెస్టిక్‌ సిలిండర్‌తో పాటు కమర్షియల్‌ సిలిండర్‌ ధరలను ఒకేసారి పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్‌పై 50 రూపాయలు.. కమర్షియల్ సిలిండర్‌పై 350 రూపాయలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

పెరిగిన సిలిండర్ ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో హైదరాబాద్‌లో డొమెస్టిక్‌ సిలిండర్ ధర 11 వందల 55 రూపాయలకు చేరగా.. ఏపీలో 11 వందల 61 రూపాయలైంది. ఇక నిన్నటి దాకా 17 వందల రూపాయలున్న కమర్షియల్ సిలిండర్ ధర ఇవాళ్టి నుంచి 2 వేల ఒక వందను క్రాస్ చేసింది. గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. ఇప్పుడు సబ్సిడీ కూడా ఎత్తి వేయడంతో సామాన్యులకు గ్యాస్‌ కొనుగోలు మరింత భారంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories