LPG Price Hiked: గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంతంటే?

Commercial LPG Cylinders Price Increased by Rs 7
x

LPG Price Hiked: గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంతంటే?

Highlights

Gas Cylinder: వినియోగదారుల నెత్తిన మరో బండ వేశాయి ఆయిల్ కంపెనీలు.

Gas Cylinder: వినియోగదారుల నెత్తిన మరో బండ వేశాయి ఆయిల్ కంపెనీలు. సామాన్యుడికి షాకిస్తూ.. మరోసారి సిలిండర్‌ ధరలను పెంచాయి. ధరల పెంపు నేటి నుంచే అమలులోకి వచ్చింది. అంటే జూలై 4 నుంచి కొత్త రేట్లు వర్తిస్తాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ.1773 నుంచి రూ.1780కు పెరిగింది. కోల్‌కతాలో ఈ సిలిండర్‌ ధర రూ. 1875 నుంచి రూ. 1882కు చేరింది. ముంబైలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1725 నుంచి రూ. 1732కు ఎగసింది. చెన్నైలో చేస్తే సిలిండర్ ధర రూ. 1937 నుంచి రూ. 1944కు చేరింది. ఐతే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. వాటి ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories