Rythu Bandhu: రైతు బంధు డబ్బులు ఖాతాల్లో పడ్డాయా లేదా.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..!

Check Rythu Bandhu Scheme Payment Status With Easy Steps
x

Rythu Bandhu: రైతు బంధు డబ్బులు ఖాతాల్లో పడ్డాయా లేదా.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..!

Highlights

Rythu Bandhu: రైతన్నలకు పెట్టుబడికి అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకంతో ధన సహాయం చేస్తుంది. ఈ క్రమంలో ఏడాదికి 2 విడతలుగా పదివేల రూపాయాల సహాయం అందిస్తోంది.

Rythu Bandhu: రైతన్నలకు పెట్టుబడికి అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకంతో ధన సహాయం చేస్తుంది. ఈ క్రమంలో ఏడాదికి 2 విడతలుగా పదివేల రూపాయాల సహాయం అందిస్తోంది. ఇక ఖరీఫ్, రబీ సీజన్లకు ముందే ఎకరానికి రూ.5 వేలు అందించనుంది. అదే సమయంలో జూన్ 26 నుంచి రైతు బంధు సహాయాన్ని రైతన్నటల అకౌంట్లలో జమ చేయడం మొదలుపెట్టింది. అయితే ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన సమయంలో తెలంగాణ ప్రభుత్వం చెక్కులను అందించేది. అయితే, చెక్కులను అందుకున్న రైతన్నలు బ్యాంకుల వద్దకు వెళ్లి డబ్బులు తెచ్చుకునేవారు. ఈ వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రభుత్వం రూపొందించింది.

ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్కులు వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌కు వెళ్లి ‘చెక్ డిస్ట్రిబ్యూషన్ వెన్యూ షెడ్యూల్’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే డ్రాప్ డౌన్ లిస్టును చెక్ చేసుకోవాలి. తమ జిల్లాను, ఆ తర్వాత మండలాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ మండలంలో చెక్కుల పంపిణీ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవచ్చు.

అయితే, చెక్కులను డబ్బులుగా మార్చోవాలంటే క్యూలో గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చేది. దీంతో ఈ సమస్యను అర్థం చేసుకున్న ప్రభుత్వం.. చెక్‌లకు బదులుగా.. నేరుగా రైతన్నల అకౌంట్లలోకే జమ చేయాలని నిర్ణయించింది.

అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు మాత్రం నేరుగా బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. లేదా నెట్ బ్యాటింగ్ ఉన్నా సరిపోతుంది. అలాగే యూపీఐతోనూ అకౌంట్లో డబ్బు పడ్డాయా లేదా అనేది తెలుసుకోవచ్చు.


Show Full Article
Print Article
Next Story
More Stories