BSNL Plan: దేశంలోనే చౌకైన ప్లాన్‌.. రూ.49తో ఇంటర్నెట్‌, కాల్స్‌ని పొందండి..!

BSNL Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)తన వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌ను తీసుకొచ్చింది.

Arun Chilukuri
Updated on: 20 July 2022 7:00 PM IST
Cheapest Plan in the Country get Internet and Calls With BSNL Rs.49
X

BSNL Plan: దేశంలోనే చౌకైన ప్లాన్‌.. రూ.49తో ఇంటర్నెట్‌, కాల్స్‌ని పొందండి..!

BSNL Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)తన వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు నేడు చాలా ఖరీదైనవిగా మారాయి. దీంతో వినియోగదారులు చౌక ప్లాన్ల గురించి వెతుకుతున్నారు. అందుకే బీఎస్ఎన్‌ఎల్‌ రూ. 49 ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఇందులో ఇంటర్నెట్‌తో పాటు కాల్స్‌ కూడా చేసుకోవచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 49 ప్లాన్‌ ప్రీపెయిడ్ ప్లాన్. ఇది ఇప్పటి వరకు చౌకైన ప్లాన్. తక్కువ మొబైల్ వాడే వారి కోసం ఈ ప్లాన్ బాగా సెట్‌ అవుతుంది. జియో, ఎయిర్‌టెల్ రెండూ ఇంతకుముందు వినియోగదారులకు రూ. 49 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందించేవి. కానీ ఇప్పుడు ఈ కంపెనీలు ఈ ప్లాన్‌ను నిలిపివేసాయి. ఈ పరిస్థితిలో ఎయిర్‌టెల్, జియో వినియోగదారులు రూ. 49 ప్లాన్‌ను ఉపయోగించలేరు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారు అయితే 49 రూపాయల చౌక ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో మీకు 3G ఇంటర్నెట్ సర్వీస్ లభిస్తుంది. త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్‌లో 4G సేవలను కూడా అందించనుంది.

రూ.49 ప్లాన్‌లో మీకు 100 నిమిషాల వాయిస్ కాలింగ్, 1GB మొబైల్ డేటా లభిస్తుంది. 20 రోజుల వాలిడిటీ అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు తమ సిమ్‌ను 20 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. 49 కంటే తక్కువ, చౌకైన ప్లాన్ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ రూ. 29 ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. ఇది కేవలం 5 రోజుల వ్యాలిడిటిని మాత్రమే కలిగి ఉంటుంది. అపరిమిత వాయిస్ కాల్‌లు, 1GB మొబైల్ డేటాను అందిస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story