Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లోకి రూ.10వేలు.. ఇలా చేస్తే చాలు..!

Central Government Scheme PM Jandhan Scheme Account Holders may get RS 10000 Rupees
x

Jan Dhan Account: జన్ ధన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లోకి రూ.10వేలు.. ఇలా చేస్తే చాలు..!

Highlights

PM Jan Dhan Account Update: కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో పేదలకు ఆర్థిక సహాయం నుంచి ఉచిత రేషన్ వరకు సౌకర్యాలు అందిస్తోంది. జన్ ధన్ ఖాతా ఉన్నవారికి ఇప్పుడు గొప్ప వార్త రాబోతోంది.

PM Jan Dhan Account Update: కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇందులో పేదలకు ఆర్థిక సహాయం నుంచి ఉచిత రేషన్ వరకు సౌకర్యాలు అందిస్తోంది. జన్ ధన్ ఖాతా ఉన్నవారికి ఇప్పుడు గొప్ప వార్త రాబోతోంది. జన్ ధన్ ఖాతాదారులకు (ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన) కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రూ.10,000 అందజేస్తోంది. దేశంలోని 47 కోట్ల మందికి పైగా ఖాతాదారులు దీని ప్రయోజనాన్ని పొందుతున్నారు. అయితే మీరు ఈ డబ్బు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం ఎవరికి రూ.10 వేలు బహుమతి ఇవ్వనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.10,000 పొందడం ఎలా?

మీకు కూడా జన్ ధన్ ఖాతాను తెరిచి ఉంటే, మీరు ప్రభుత్వం నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం పొందగలరు. ఈ సదుపాయం కింద, మీ ఖాతాలో ఒక్క రూపాయి లేకపోయినా, మీరు రూ. 10,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యంపై ఇంతకుముందు రూ. 5000లు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ప్రభుత్వం ఈ పరిమితిని రూ. 10,000కి పెంచింది. దీని కోసం మీరు బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు.

పథకం ప్రత్యేకత-

18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సు గల ఎవరైనా ఈ సౌలభ్యాన్ని పొందవచ్చు.

ఈ పథకంలో 60 సంవత్సరాల వయస్సు వరకు డబ్బు పొందే ఛాన్స్ ఉంటుంది.

ఇందులో సంవత్సరానికి రూ.36,000లు ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.

అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు.

మీ నెలవారీ ఆదాయం రూ.15,000ల కంటే తక్కువ ఉంటే మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఈ ఖాతాను ఎక్కడ తెరవొచ్చు?

మీరు ఈ ప్రభుత్వ ఖాతాను ప్రైవేట్ లేదా ప్రభుత్వ బ్యాంకులో ఎక్కడైనా తెరవవచ్చు. ఇది కాకుండా, మీకు ఇప్పటికే సేవింగ్స్ ఖాతా ఉంటే, మీరు ఆ ఖాతాను జన్ ధన్ ఖాతాగా మార్చుకోవచ్చు. ఈ ఖాతాను తెరవడానికి మీకు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories