Central Government: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ ఖాతాదారులకి త్వరలో తీపికబురు..!

Central Government increase interest rate for Sukanya Samridhi Yojana PPF accounts
x

Central Government: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ ఖాతాదారులకి త్వరలో తీపికబురు..!

Highlights

Central Government: మీరు సుకన్య సమృద్ధి యోజన లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టినట్లయితే ఈ వార్త మిమ్మల్ని సంతోషపరుస్తుంది.

Central Government: మీరు సుకన్య సమృద్ధి యోజన లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టినట్లయితే ఈ వార్త మిమ్మల్ని సంతోషపరుస్తుంది. SSY, PPF వడ్డీ రేట్లలో ప్రభుత్వం త్వరలో మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే వారికి చాలా ప్రయోజనం లభిస్తుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వ పొదుపు పథకాలపై వడ్డీ రేటు ప్రస్తుత రేటు కంటే ఎక్కువగా ఉండవచ్చు. RBI రెపో రేటును పెంచిన తర్వాత వివిధ బ్యాంకులు FD, RD వడ్డీ రేటును పెంచుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వ పొదుపు పథకాలపై వడ్డీ రేటు పెరుగుతుందని అందరు భావిస్తున్నారు.

వడ్డీ రేట్లు జూన్ 30న మారే అవకాశాలు

జూన్ 30న చిన్న పొదుపు పథకంపై వడ్డీ రేట్లు మారే అవకాశాలు ఉన్నాయి. ఇది జూలై నుంచి సెప్టెంబర్ వరకు వర్తిస్తాయి. ఈసారి ప్రభుత్వం నుంచి పొదుపు పథకాలపై వడ్డీ రేటు పెరుగుతుందని అందరు భావిస్తున్నారు. చాలా కాలంగా చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. ఈ పరిస్థితిలో ద్రవ్యోల్బణం దృష్ట్యా వాటిపై వడ్డీని పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

వడ్డీ రేటు ఎందుకు మారే అవకాశం ఉంది..?

బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ రెండూ చిన్న పొదుపు పథకాలపై వడ్డీని పెంచడానికి అనుకూలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు భవిష్యత్తులో రెపో రేటును పెంచవచ్చని ఆర్‌బీఐ గవర్నర్ కొద్దిరోజుల క్రితం సూచించారు. వడ్డీ రేటు పెంపుతో PPF, సుకన్య సమృద్ధి యోజనపై రాబడులు పెరిగే అవకాశం ఉంది.

ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లు పెరుగుతాయి

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని సమీక్షిస్తుంది. ఈ సమీక్ష సమయంలో వడ్డీ రేటును పెంచాలా, తగ్గించాలా లేదా స్థిరంగా ఉంచాలా అనే నిర్ణయం తీసుకుంటారు. ఈ వడ్డీ రేట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది.

ఏ పొదుపు పథకంపై ఎంత వడ్డీ

ప్రస్తుతం PPFపై సంవత్సరానికి 7.1% చొప్పున వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టే వారికి 7.6% వార్షిక రాబడి అందుతుంది. అదేవిధంగా మీరు నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ల ఖాతా గురించి మాట్లాడినట్లయితే అది 5.8% రాబడిని అందిస్తుంది. కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories