Canara Bank: కెనరా బ్యాంకులో అకౌంట్ ఉందా.. రూ.50,000 వేలు సులువుగా పొందవచ్చు..!

Canara Bank: కరోనా వల్ల చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా మారింది.

hmtv Digital Team
Updated on: 16 Dec 2021 10:43 AM IST
Canara Bank Offers its Customers an Easy Rs 50,000 Loan Under Shishu Mudra Loans
X

Canara Bank: కెనరా బ్యాంకులో అకౌంట్ ఉందా.. రూ.50,000 వేలు సులువుగా పొందవచ్చు..!

Canara Bank: కరోనా వల్ల చాలామంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కుటుంబాన్ని పోషించడం కూడా కష్టంగా మారింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీలు బలవంతగా తొలగించాయి. ఇలాంటి సమయంలో చాలామంది చిన్న చిన్న పనులు చేసుకుంటు కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారు వ్యాపారం పెట్టుకోవాలన్నా ఏదైనా ఉపాధి కావాలన్నా పెట్టుబడి అవసరం. అందుకే దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైనా కెనరా బ్యాంకు సులభంగా రూ. 5000 వేల వరకు రుణం మంజూరు చేస్తుంది. ఈ పథకం పేరు 'కెనరా శిశు ముద్ర లోన్'. అయితే ఒక కండీషన్ ఏంటంటే ఈ లోన్‌ కేవలం కెనరా బ్యాంకు కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.

50,000 వరకు ఆన్‌లైన్ తక్షణ రుణం

కెనరా శిశు ముద్రా లోన్ కింద కెనరా బ్యాంక్ కస్టమర్లకు చిన్న వ్యాపారం కోసం రూ. 50,000 వరకు ఆన్‌లైన్ తక్షణ రుణాన్ని అందజేస్తున్నారు. లోన్ పొందడానికి మీ వెరిఫికేషన్, డిజిటల్ డాక్యుమెంటేషన్ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేస్తారు. ఆ తర్వాత లోన్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు. కెనరా బ్యాంక్ ఖాతాదారులకు మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నారు. మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీకు డబ్బు అవసరమైతే, మీరు కెనరా బ్యాంక్‌లో ఖాతా ఓపెన్ చేయాల్సిందే. అప్పుడే లోన్‌కి అర్హులు అవుతారు.

కెనరా బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ పథకం గురించి సమాచారాన్ని అందించింది. దీంతో పాటుగా ట్వీట్‌లో లింక్ ఇచ్చారు. దీనిపై క్లిక్ చేయడం ద్వారా మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మీకు కెనరా బ్యాంక్‌లో ఖాతా ఉంటే మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లింక్ వారి ఖాతా నంబర్‌ను నమోదు చేసే వ్యక్తులకు మాత్రమే సహాయపడుతుంది. కెనరా బ్యాంక్ ఈ పథకం గురించి మరింత సమాచారం కోసం మీరు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


hmtv Digital Team

hmtv Digital Team

Next Story