HDFC Express Car Loan: ఇప్పుడు 30 నిమిషాల్లో కారు కొనండి.. హెచ్‌డిఎఫ్‌సి ఎక్స్‌ప్రెస్ కార్ లోన్..!

HDFC Express Car Loan: మీరు కారు కోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీ కోసమే.

Arun Chilukuri
Published on: 12 May 2022 2:50 PM IST
Buy a Car in 30 Minutes now HDFC Express car Loan See Details
X

HDFC Express Car Loan: ఇప్పుడు 30 నిమిషాల్లో కారు కొనండి.. హెచ్‌డిఎఫ్‌సి ఎక్స్‌ప్రెస్ కార్ లోన్..!

HDFC Express Car Loan: మీరు కారు కోసం లోన్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు మీరు కేవలం 30 నిమిషాలలో లోన్ తీసుకొని కారును కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC తన కస్టమర్ల కోసం కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని కింద మీరు కేవలం 30 నిమిషాల్లో కారు లోన్ పొందుతారు. బ్యాంక్ ప్రవేశపెట్టిన ఈ అద్భుతమైన సదుపాయంతో మీ కారు కల సులభంగా నెరవేరుతుంది. ఇది మాత్రమే కాదు దేశంలోనే ఈ రకమైన కార్ లోన్ సదుపాయం ప్రవేశపెట్టిన మొట్టమొదటి బ్యాంకు ఇదే. మీరు ఈ సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక 'ఎక్స్‌ప్రెస్ కార్ లోన్' సదుపాయాన్ని ప్రారంభించింది. మీరు దీని ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మొత్తం ప్రక్రియ డిజిటల్‌గా ఉంటుందని తెలుసుకోండి. ఈ సదుపాయం కోసం బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న కార్ డీలర్‌లతో రుణ దరఖాస్తులను ఏకీకృతం చేసింది. ఈ సదుపాయంతో దేశంలో కార్ల విక్రయాలు భారీగా పెరుగుతాయని బ్యాంక్ అభిప్రాయపడింది. ఈ సేవను ప్రారంభించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కంట్రీ హెడ్ అరవింద్ కపిల్ మాట్లాడుతూ..

"డిజిటల్ ఇన్నోవేషన్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎప్పుడూ ముందుంటుంది. మేము కొత్త కస్టమర్ల కోసం ఎండ్-టు-ఎండ్ డిజిటల్ కార్ లోన్ సొల్యూషన్‌ను ప్రారంభించడం ద్వారా మా స్థానాన్ని బలోపేతం చేయబోతున్నాం. ఈ సదుపాయం బ్యాంక్ అన్ని శాఖలు, డీలర్‌షిప్‌లు, థర్డ్ పార్టీ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎక్స్‌ప్రెస్ ఆటో లోన్ సదుపాయం నాలుగు చక్రాల వాహనాల కోసం ఉంది. క్రమంగా ద్విచక్ర వాహన రుణాల కోసం కూడా దీన్ని ప్రారంభిస్తాం" అని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story