Stock Market: ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్
Stock Market: నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
Stock Market: ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్
Stock Market: ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో వరుస లాభాల్లో దూసుకెళ్లిన మన మార్కెట్లు.. వారాంతంలో నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు బజాజ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ, కోటక్ బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేశాయి. దీంతో సెన్సెక్స్ 609 పాయింట్ల మేర నష్టపోయి... 73 వేల 730 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 150 పాయింట్లు నష్టపోయి 22 వేల 419 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.35గా ఉంది.
Next Story




