Interest Rates: వడ్డీరేట్లు పెంచిన ఈ మూడు బ్యాంకులు.. ఎంత పెంచాయంటే..!

Interest Rates: వడ్డీరేట్లు పెంచిన ఈ మూడు బ్యాంకులు.. ఎంత పెంచాయంటే..!
Interest Rates: మీ ఖాతా బ్యాంక్ ఆఫ్ బరోడా, SBI లేదా HDFC బ్యాంక్‌లో ఉంటే ఈ వార్త మీకోసమే.
Interest Rates: మీ ఖాతా బ్యాంక్ ఆఫ్ బరోడా, SBI లేదా HDFC బ్యాంక్‌లో ఉంటే ఈ వార్త మీకోసమే. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చింది. బ్యాంకు ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీని అందిస్తోంది. ఫిబ్రవరి 25 నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును మార్చింది. కొత్త FD వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలానికి 2.80 శాతం నుంచి 5.25 శాతానికి పెరిగాయి.
1 సంవత్సరం లోపు 4.4% వడ్డీ ప్రస్తుతం బ్యాంక్ 7 రోజుల నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై 2.80 శాతం వడ్డీని ఇస్తుంది. మార్పు తర్వాత 46 రోజుల నుంచి 180 రోజుల వరకు మెచ్యూరిటీపై 3.7 శాతం, 181 నుంచి 270 రోజుల వరకు మెచ్యూరిటీపై 4.30 శాతం వడ్డీ లభిస్తుంది. 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు వరకు ఉండే FDలపై వడ్డీ 4.4 శాతం చెల్లిస్తుంది.
గరిష్ట వడ్డీ రేటు 5.25 శాతం ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే FDలపై వడ్డీ రేటు 5 శాతం. 1 సంవత్సరం కంటే ఎక్కువ, మూడు సంవత్సరాల వరకు FDలపై వడ్డీ రేటు 5.1 శాతం. 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ FDలకు 5.25 శాతం వడ్డీ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 10 సంవత్సరాల వరకు FDలకు 5.25 శాతం వడ్డీని అందిస్తోంది. ఇంతకుముందు ఎఫ్‌డిలపై వడ్డీని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ కూడా మార్చాయి.
SBIలో FDపై వడ్డీ
7 రోజుల నుంచి 45 రోజుల వరకు-----2.90 %
46 రోజుల నుంచి 179 రోజుల వరకు-----3.90%
180 రోజుల నుంచి 210 రోజుల వరకు-----4.40%
211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ వరకు-- -- -4.40%
1 సంవత్సరం కంటే ఎక్కువ, రెండు సంవత్సరాల కంటే తక్కువ ---5.10 %
2 సంవత్సరాల కంటే ఎక్కువ, 3 సంవత్సరాల కంటే తక్కువ -----5.20 %
3 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ ---- -5.45%
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు------5.50%
HDFCలో FDపై వడ్డీ
7 నుంచి14 రోజులు-----2.50 %
15 నుంచి 29 రోజులు-----2.50 %
30 నుంచి 45 రోజులు-----3.00 %
46 రోజుల నుంచి 60 రోజులు-----3.00 %
61 రోజుల నుంచి 90 రోజులు -----3.00 %
91 రోజుల నుంచి 6 నెలల వరకు-----3.50 %
6 నెలలు 1 రోజు నుంచి 9 నెలలు----4.40%
9 నెలలు 1 రోజు నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ ----4.40%
1 సంవత్సరానికి ----5.00%
1 సంవత్సరం 1 రోజు నుంచి 2 సంవత్సరాల వరకు----5.00%
2 సంవత్సరాలకు 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు----5.20%
3 సంవత్సరం 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు----5.45%
5 సంవత్సరాలు 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు -----5.60%
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT