Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున 10 నిమిషాల్లో మీ ఇంట్లో బంగారం..!

Akshaya Tritiya 2024: ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగానే బంగారం ఆర్డర్ చేయడం గురించి మీకు తెలుసా...ఇంటి వద్దే కాలు కదపకుండానే 10 నిమిషాల్లో బంగారం మీ ఇంటికి చేరుతుంది.

Blinkit, Swiggy Instamart and Zepto can help you on Akshaya Tritiya 2024
X

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున 10 నిమిషాల్లో మీ ఇంట్లో బంగారం..!

Akshaya Tritiya 2024: ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగానే బంగారం ఆర్డర్ చేయడం గురించి మీకు తెలుసా...ఇంటి వద్దే కాలు కదపకుండానే 10 నిమిషాల్లో బంగారం మీ ఇంటికి చేరుతుంది. అక్షయ తృతీయ రోజున పలు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ఆన్ లైన్ లో బంగారం డెలీవరీ ఆఫర్ ను ముందుకు తెచ్చాయి.

అక్షయ తృతీయ రోజున బంగారం కోనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతారు. ఈ అవకాశాన్ని ఈ కామర్స్ సంస్థలు తమకు అనుకూలంగా మలుచుకొన్నాయి. బ్లింకింట్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, జెప్టో వంటి ఈ కామర్స్ సంస్థలు 10 నిమిషాల్లో మీ ఇంటికే బంగారం, వెండిని చేరవేయనున్నాయి. అక్షయ తృతీయ రోజున బంగారంతో పాటు అక్షయ తృతీయ కిట్ ను కూడ బ్లింకిట్ అనే సంస్థ వినియోగదారులకు 10 నిమిషాల్లో చేరవేయనుంది. ఈ కిట్ లో పూజా సామాగ్రితో పాటు దేవతల ఫోటోలు ఉంటాయి.

ప్రముఖ జ్యుయలరీ సంస్థలతో ఈ కామర్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం మేరకు స్విగ్గీ, బ్లింకింట్, బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో కష్టమర్ ఇంటికి బంగారాన్ని అందించనున్నాయి. మలబార్ గోల్డ్ సంస్థతో స్విగ్గీ ఇన్ స్టామార్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే వినియోగదారుడి ఇంటికి బంగారం చేరుస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

తనిష్క్, ఎంఎంటీసీ, పీఎఎంపీ సంస్థలతో బిగ్ బాస్కెట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. లక్ష్మీ గోల్డ్ కాయిన్స్ తో పాటు వెండి నాణెలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఇక జెప్టో ఒక గ్రాము బంగారు నాణెలను అక్షయ తృతయ రోజున వినియోగదారులకు అందించనుంది. 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్లతో పాటు 10 గ్రాములు వెండి నాణెలు వినియోగదారులు ఆర్డర్ చేసిన వెంటనే వారికి అందించనున్నట్టుగా ప్రకటించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story