TB Vaccine: క్షయ వ్యాధి నిర్మూలనకు భారత్ బయోటెక్ కొత్త టీకా

TB Vaccine: క్షయ వ్యాధి నిర్మూలనకు భారత్ బయోటెక్ కొత్త టీకా
x

TB Vaccine: క్షయ వ్యాధి నిర్మూలనకు భారత్ బయోటెక్ కొత్త టీకా

Highlights

TB Vaccine: ఏటా 10 లక్షల మంది మరణానికి కారణమవుతున్న క్షయ వ్యాధి నిర్మూలనకు.... టీకా తీసుకురానున్నట్టు BBIL తెలిపింది.

TB Vaccine: ఏటా 10 లక్షల మంది మరణానికి కారణమవుతున్న క్షయ వ్యాధి నిర్మూలనకు.... టీకా తీసుకురానున్నట్టు BBIL తెలిపింది. క్షయ వ్యాధి చికిత్సలో ఉపయోగించే రెండు వ్యాక్సిన్లలో ఒకటైన ఎంటీబీవీఏసీ టెక్నాలజీ బదిలీకి సంబంధించి భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వ్యాక్సిన్‌ తయారీ కంపెనీ బయోఫ్యాబ్రి ప్రకటించింది. ఎంటీబీవీఏసీ ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోకి చేరింది.

దీనిపై 2022 సంవత్సరంలోనే ఉభయ సంస్థల మధ్య లైసెన్సింగ్‌ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు టెక్నాలజీ బదిలీకి దాన్ని విస్తరించడంతో భారత్‌ బయోటెక్‌ ప్లాంట్లలో ఎంటీబీవీఏసీ తయారీకి మార్గం సుగమం అవుతుందని బయోఫ్యాబ్రి తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా భారత్‌ బయోటెక్‌ ఎంటీబీవీఏసీ వ్యాక్సిన్‌ తయారీకి, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో క్షయ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 70కి పైగా దేశాల్లో దాని పంపిణీకి భరోసా ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories